పవన్ కళ్యాణ్ కోసం మాధవీలత సంచలన నిర్ణయం.. ఫిల్మ్ ఛాంబర్ ముందు మరో రచ్చ!
Recommended Video

టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ దారుణాలపై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి సంచలన పోరాటం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం ఛాంబర్ ముందు ఆమె అర్థ నగ్న నిరసనతో ఈ పోరాటం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి పోరాటం గురించి స్పందిస్తూ మీడియా చర్చల్లో పాల్గొంటే న్యాయం జరగదని, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. పవన్ స్పందనపై కొందరు జూనియర్ ఆర్టిస్టులు మండిపడడం, ఆ తరువాత శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై పరుష పదజాలం ఉపయోగిస్తూ అతిదారుణమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్రమైన వివాదంగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసారు. ఆ యుద్ధంలోకి మరో హీరోయిన్ ప్రత్యక్షంగా దిగబోతోంది.

పవన్ అభిమానులని హర్ట్ చేసిన శ్రీరెడ్డి
ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడిన శ్రీరెడ్డి మీడియా ముందు సహనం కోల్పోయి ప్రవర్తించింది. పవన్ కళ్యాణ్ తల్లికి గుచ్చుకునేలా అసభ్యమైన వ్యాఖ్యలు, చేష్టలు చేసింది. చెప్పుతో కొట్టుకోవడం, పవన్ కళ్యాణ్ ని ఏ అమ్మాయి అన్న అని పిలవవద్దని కోరడం వంటి విషయాలు పవన్ ఫాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

సోషల్ మీడియాలో వార్
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై వార్ మొదలు పెట్టారు. దీనితో సమస్య ఇంకా తీవ్రతరంగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు సెలెబ్రిటీలు శ్రీరెడ్డి తక్షణం తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ కు, అతని తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్న మాధవీలత
ప్రముఖ నటి మాధవీలత తాను పవన్ కళ్యాణ్ ని అభిమానించే వ్యక్తిని అని గతంలోనే చెప్పుకుంది. సమాజం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావాన్ని ఆమె ప్రశంసించింది.

ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థ నగ్న నిరసన
శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్థ నగ్న నిరసన తెలపడంతో ఈ సమస్య జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కొంత మంది మహిళా నటులు మద్దత్తు ప్రకటించారు.

మాధవీలత సంచలన నిర్ణయం
పవన్ కళ్యాణ్ ని అభిమానించే వ్యక్తిగా మాధవీలత పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలని ఖండిస్తోంది. దీనితో మాధవీలత సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాన్ పై వ్యాఖ్యలకు నిరసనగా మాధవీలత నేడు ఫిలిం ఛాంబర్ ఎదుట రెండు గంటల పాటు మౌన దీక్ష చేయనుంది.

పవన్ కళ్యాణ్‌ని ఎందుకు వాడుతున్నారు
తాను మౌన నిరసనకు దిగబోతున్న విషయాన్ని శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఈ సందర్భంగా మాధవీలత శ్రీరెడ్డి గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ ని ఎందుకు వాడుకోవడం బట్టలు ఇప్పుకుంటే చాలు అనే సామెత చెప్పాలని ఉంది. కానీ చెప్పను.. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది అని మాధవీలత వ్యాఖ్యానించింది.

సంబంధం లేని వ్యక్తుల మీద
సంబంధం లేని వ్యక్తుల మీద సంస్కారం లేని మాటలని తాను సహించనని మాధవీలత అన్నారు. సమస్యకు పరిష్కార మార్గాలు వెతకాలి కానీ ఇలా వినటానికి కూడా ఇష్టపడని మాటలతో సంబంధం లేని వ్యక్తులని నిందించడం తాను జీర్ణించుకోలేనని మాధవీలత అన్నారు.

అలాంటి పదజాలం ఉపయోగించలేం
తాము అలాంటి పదజాలం ఉపయోగించలేం మాధవీలత అన్నారు. అందుకే తాను మౌన దీక్షకు దిగుతున్నట్లు వివరించారు. మాధవీలత ప్రకటనతో మరోమారు టాలీవుడ్ లో సంచలనం మొదలైంది.


Click it and Unblock the Notifications











