మహేష్ డుమ్మా: శ్రీమంతుడు మించేలా కొరటాలతో మరో మూవీ షురూ (ఫోటోస్)
హైదరాబాద్: 'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్ మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవంబర్ 9 ఉదయం 10.26 గం.లకు రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి క్లాప్ కొట్టగా మరో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
ఈ కార్యక్రమానికి మహేష్ డుమ్మా కొట్టారు. మురుగదాస్ షూటింగులో బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారని యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే ఈ పూజా కార్యక్రమానికి మహేష్ భార్య నమ్రత హాజరయ్యారు. గతంలో శ్రీమంతుడు ప్రారంభోత్సవం సమయంలో కూడా మహేష్ బాబు డుమ్మా కొట్టారు, ఆ మూవీ కూడా అన్నపూర్ణ స్టూడియోలో శ్యాంప్రసాద్ రెడ్డి క్లాపుతో ప్రారంభం అయింది. బహుషా సెంటిమెంటు పరంగా కలిసొస్తుందనే ఇలా చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

శ్రీమంతుడు కంటే పవర్ ఫుల్
ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ - ''శ్రీమంతుడు లాంటి సూపర్ మూవీ తర్వాత మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో శ్రీమంతుడు కంటే పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తీస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా వుంటుందని తెలిపారు

మహేష్ బాబు పాత్ర
ఇందులో మహేష్‌బాబు ఇంతకుముందు పోషించని ఒక వైవిధ్యమైన పాత్రను చేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ముఖ్యపాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రవి క���.చంద్రన్, దేవిశ్రీప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్‌తో చాలా పెద్ద రేంజ్‌లో దానయ్యగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు'' అన్నారు కొరటాల శివ.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ
''మహేష్‌బాబు గారితో ఓ సెన్సేషనల్ మూవీ చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. వరసగా ఘనవిజయాల్ని అందిస్తున్న కొరటాల శివగారి దర్శకత్వంలో ఇంత మంచి సినిమా చేస్తున్నందుకు గర్వంగా వుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ
''వరసగా కొరటాల శివగారి సినిమాలన్నీ చేయడం చాలా ఆనందంగా వుంది. మహేష్‌బాబుగారితో చేసిన శ్రీమంతుడు ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఇది శ్రీమంతుడు కంటే పెద్ద కథ. అలాగే శ్రీమంతుడు కంటే ఆడియో పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ మాట్లాడుతూ
''మూడేళ్ళ క్రితం ట్విట్టర్‌లో నా అభిమాన హీరో మహేష్ అని ట్వీట్ చేశాను. ఇప్పుడు మహేష్‌తో కలిసి వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది. మహేష్, కొరటాల శివగార్ల కాంబినేషన్‌లో ఈ చిత్రం టెక్నికల్‌గా హై రేంజ్‌లో వుంటుందన్నారు. ఇంతకుముందు నేను ఎన్నో భారీ చిత్రాలు చేసినా కూడా నా అభిమాన హీరోతో చేస్తున్న ఈ సినిమాకి నూతనోత్సాహంతో వర్క్ చేస్తాను'' అన్నారు.

వివరాలు
డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.

మహేష్ బాబు రాలేదు, నమ్రత వచ్చింది
మహేష్ బాబు మురుగదాస్ మూవీ షూటింగులో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు, అయితే మహేష్ బాబు సతీమణి నమ్రత ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

మిస్ ఇండియా
షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..
షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి)

మహేష్ బాబు లాంటి మొగుడ్ని కోరకునే అమ్మాయిలు: సంపూ సెటైర్!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!
ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)


Click it and Unblock the Notifications











