»   » షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నమ్రత శిరోద్కర్.... మహేష్ బాబుకు భార్య కాక ముందు మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా 'వంశీ'. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ఆమె పరిచయం ప్రేమగా మారడం, దాదాపు ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

మహేష్ బాబుతో 'వంశీ' సినిమా తర్వాత ఆమె తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004 వచ్చిన 'అంజి' చిత్రంలో నమ్రత నటించింది. ఆ తర్వాత ఏడాదే మహేష్బాబుతో ఆమె వివాహం జరుగడంతో సినిమాలు మానేసింది.

1998లో 'జబ్ ప్యార్ కిసీసే హోతాహై' సినిమా ద్వారా నమ్రత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. సౌత్ లో ఆమె చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో రెండు, కన్నడ, మళయాలంలో ఒక్కో సినిమా మాత్రమే చేసింది.

ముంబైలో జన్మించిన నమ్రత టీనేజీ వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. తనం అందం, ఆటిట్యూడ్‌తో మిస్ ఇండియా స్థాయికి ఎదిగింది. నమ్రత గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు, ఆమె మోడలింగ్ చేసిన రోజుల్లోని రేర్ ఫోటోస్ స్లైడ్ షోలో....

నమ్రత శిరోద్కర్

నమ్రత శిరోద్కర్

నమ్రత మహారాష్ట్రియన్ ఫ్యామిలీలో పుట్టింది నిజమే కానీ... ఆమె పూర్వీకులు గోవన్ (గోవా ప్రాంతం) మూలాలు కలిగిన వారే.

నమ్రత కూడా సినీ వారసత్వమే..

నమ్రత కూడా సినీ వారసత్వమే..

మహేష్ బాబు తన తండ్రి కృష్ణ వారసత్వం పుచ్చుకున్నట్లే... నమ్రత కూడా తన గ్రాండ్ మదర్, ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్ వారసత్వం పుచ్చుకుంది. స్వాతంత్రానికి ముందు(1938) వచ్చిన బ్రహ్మచారి చిత్రంలో మీనాక్షి నటించింది. నమ్రత అక్కయ్య శిల్ప శిరోద్కర్ కూడా నటిగా ఇంకా కొనసాగుతోంది.

మహేష్ బాబు కంటే వయసులో పెద్ద..

మహేష్ బాబు కంటే వయసులో పెద్ద..

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... నమ్రత వయసులో మహేష్ బాబు కంటే పెద్దది. నమ్రత మార్చి 1, 1972లో జన్మించింది. మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో జన్మించారు. అంటే ఇద్దరి మధ్య మూడేళ్లకుపైగా వయసు తేడా ఉంది.

మిస్ ఇండియా

మిస్ ఇండియా

మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

 ఇండియా తరుపున

ఇండియా తరుపున

ఇండియా తరుపున మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొంది కానీ విశ్వ సుందరి కిరీటం దక్కించుకోలేక పోయింది. ఆ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచింది.

అదే ఏడాది..

అదే ఏడాది..

అదే ఏడాది జరిగిన మిస్ ఏసియా పసిఫిక్ పోటీల్లో పాల్గొన్న నమ్రత ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.

తొలి సినిమా రిలీజ్ కాలేదు

తొలి సినిమా రిలీజ్ కాలేదు

మిస్ ఇండియాగా గెలిచిన తర్వాత నమ్రతకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన తొలి సినిమా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి లీడ్ రోల్ లో నటించిన ‘పురబ్ కి లాలియా పశ్చిమ్ కి చాలియా'. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.

వాస్తవ్

వాస్తవ్

వాస్తవ్ మూవీ నమ్రత్ కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

మహేష్ బాబుతో..

మహేష్ బాబుతో..

2004లో మహేష్ బాబుతో వంశీ చిత్రంలో నటించిన నమ్రత... ఈ సినిమా సమయంలో అతనితో ఏర్పడిన పరిచయంతో ప్రేమలో పడింది.

ఐదేళ్లు డేటింగ్

ఐదేళ్లు డేటింగ్

ఇద్దరూ కలిసి ఐదేళ్లు డేటింగ్ చేసారు. అయితే వీరి పెళ్లికి మహేష్ బాబు సైడ్ నుండి అభ్యంతరాలు ఏర్పడటంతో..... పెద్దలను ఎదిరించిన మహేష్ బాబు ముంబైలో నమ్రతను పెళ్లాడారు.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

పెళ్లి తర్వాత నమ్రత సినిమాలు మానేసింది. ప్రస్తుతం నమ్రత-మహేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు. అటు ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు, తమ సొంత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ మహేష్ బాబు ఫుల్ సపోర్టుగా ఉంటోంది నమ్రత.

English summary
Namrata Shirodkar is an Indian film actress, producer and former model known for her works in Bollywood and Telugu cinema. She was awarded the Femina Miss India in 1993. She married Telugu actor Mahesh Babu on 10 February 2005, the couple have a son and a daughter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X