»   » మహేష్ బాబుతో ‘జన గణ మన’..పూరి ప్రకటన (ఫస్ట్ లుక్)

మహేష్ బాబుతో ‘జన గణ మన’..పూరి ప్రకటన (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పోకిరి చిత్రం పదేళ్ల క్రితం విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌ దాటిన తొలి సినిమా 'పోకిరి'.

Janaganamana-mahesh-puri

ఈ మూవీ తర్వాత పూరి మహేష్‌తో బిజినెస్‌మేన్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. మహేష్-పూరి కాంబినేషన్లో హాట్రిక్ మూవీ రాబోతోంది. పోకిరి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూరి అభిమానులకు చల్లటి కబురు చెప్పారు. 

మహేష్ బాబుతో చేయబోయే మూడో సినిమాను ప్రకటించారు. 'జనగనమన' పేరుతో ఈ సినిమా వస్తుందని పూరి తెలిపారు. పోకిరి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూరి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం విశేషం.

English summary
Puri Jagan announced Janaganamana film with Mahesh as main lead. He has made this announcement on the eve of 10 years of Pokiri. This will be 3rd film for this combination after Pokiri and Businessman. Other details are awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu