హిట్లుంటేనే చేస్తాడు.. నాకంటూ ఓ క్యారెక్టర్ ఉండదా? మహేష్ బాబుపై పూరి సంచలనం!

Recommended Video

Puri Jagannadh Insults Mahesh Babu With This Brutal Dig?

మహేష్ బాబు హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ 'పోకిరి', 'బిజినెస్‌మ్యాన్' లాంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'జన గణ మన' సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అందుకు కారణం పూరి వరుస ప్లాపుల్లోకి వెళ్లడమే అనే ప్రచారం జరిగింది.

అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం... పూరిని తరచూ 'జన గణ మన' ప్రాజెక్ట్ గురించి అడుగుతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో ఆయన నుంచి సరైన సమాధానం మాత్రం వారికి దొరకలేదు. 'ఇస్మార్ట్ శంకర్' మూవీ ప్రమోషన్లో పాల్గొన్న పూరికి మళ్లీ 'జన గణ మన' గురించిన ప్రశ్న ఎదురవ్వగా ఎట్టకేలకు స్పందించారు.

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడూ అదే విషయం అడుగుతారు

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడూ అదే విషయం అడుగుతారు

నేను ప్లాపుల్లో ఉన్నపుడు, ప్లాపుల్లో లేనపుడు ప్రతి రోజూ నాకు మహేష్ బాబు అభిమానుల నుంచి మెసేజెస్ వస్తూనే ఉంటాయి. జగ గణ మన... మహేష్ బాబుతో చేయండి అని అడుగుతుంటారు. గతంలో మహేష్ బాబుతో మంచి సినిమాలు చేశాననే అభిమానం వారికి ఎక్కడో కొంత ఉంది కాబట్టి ఇలా అడుగుతుంటారు... అని పూరి చెప్పుకొచ్చారు.

నేను హిట్లలో ఉంటేనే చేస్తాడు

నేను హిట్లలో ఉంటేనే చేస్తాడు

కానీ మహేష్ అభిమానులకు అర్థం కానిది ఏమిటంటే... నేను హిట్లలో ఉంటేనే వాళ్ల హీరో నాతో సినిమా చేస్తాడు. నేను చాలా సార్లు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నాకు మహేష్ కంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇష్టం. కనీసం వారికైనా నా మీద నమ్మకం ఉంటుంది... అని పూరి వ్యాఖ్యానించారు.

నాకంటూ ఓ క్యారెక్టర్ ఉండదా?

నాకంటూ ఓ క్యారెక్టర్ ఉండదా?


‘ఇస్మార్ట్ శంకర్' హిట్టయింది కాబట్టి మీరు ఫాంలో ఉన్నట్లే... ఏమో మహేష్ బాబు ఇపుడు మీకు ఒకే చెప్పవచ్చేమో.... అని యాంకర్ ప్రశ్నించగా ‘‘నేను ఓకే చెప్పడానికి నాకంటూ ఓ క్యారెక్టర్ ఉండాలి కదండీ..'' అంటూ పూరి సంచలన కామెంట్ చేశారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా నేను మహేష్ బాబుతో సినిమా చేయను అని చెప్పకనే చెప్పారు ఈ క్రేజీ డైరెక్టర్.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

కాగా... ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత పూరి మీడియాతో మాట్లాడారు. మా మొహాలు చూస్తేనే మీకు అర్థమయి ఉంటుంది. ఇష్మార్ట్ బ్లాక్ బస్టర్ అయిందనే విషయం మా మొహాల్లో కనిపిస్తుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి ఓపెనింగ్స్ మేము ఊహించలేదు. ప్రతి ఊర్లో థియేటర్లు పెంచినా టిక్కెట్లు దొరక్క కొందరు వెనక్కి వెళుతున్నారు. ఈ సినిమాను సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున థాంక్స్.. అని పూరి తెలిపారు.

డబుల్ ఇస్మార్ట్

డబుల్ ఇస్మార్ట్

‘ఇస్మార్ట్ శంకర్' మూవీ ఇచ్చిన జోష్‌తో పూరి త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘డబల్ ఇస్మార్ట్' పేరుతో ఈ మూవీ ఉంటుందట. ఇప్పటికే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. ఈ విషయాన్ని పూరి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X