టచ్ చేశావ్ మనోజ్.. పూరి ట్వీట్ వైరల్

పూరి జగన్నాద్ ఇండస్ట్రీకి వచ్చి ఈ మధ్యే ఇరవై యేళ్లు పూర్తయింది. దర్శకుడిగా మొదట చిత్రం బద్రి విడుదలై 20 యేళ్లు కావడంతో పూరి జగన్నాద్‌కు విషెస్ వెల్లువెత్తాయి. మరో ఇరవై యేళ్లు ఇలాగే కొనసాగాలని, ఇంకా మరెన్నో గొప్ప చిత్రాలను అందించాలని ఆయన అభిమానులే కాదు సినీ సెలెబ్రిటీలెందరో కోరుకున్నారు. ఆ మధ్య హిట్స్ లేక సతమతమైన పూరి ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ కమ్ బ్యాక్ అవ్వడం ఆయన అభిమానులకు ఊపిరిపోసింది.

ఇస్మార్ట్ శంకర్ హిట్ ఊపులో ఉన్న పూరికి ఈ ఇరవై యేళ్లలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. దర్శకుడిగా పీక్స్‌లో ఉన్నా.. ఫెయిల్యూర్స్ వచ్చినా పూరి మాత్రం అలాగే ఉన్నాడు. ఇదే విషయాన్ని మంచు మనోజ్ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. పూరి జగన్నాద్ దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్ట్ చేశాడు. అయితే లేటుగా స్పందించినా కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు.

నేను చూసినవారిలోకెల్లా పూరి జగన్నాద్‌కు శ్రమపడే గుణం ఎక్కువగా ఉంది. నేను నా కెరీర్‌ను మొదలు పెట్టిన రోజుల్లో ఆయన వ్యక్తిగా నాకు తెలుసు. ఎంతో స్నేహంగా ఉండేవారు.. ప్రోత్సహించేవారు.. సక్సెస్‌లు వచ్చినా ఫెయిల్యూర్స్ ఎదురైనా బండలా అలానే ఉన్నారు.. మీ ఇరవై యేళ్ల ప్రయాణం మాకెంతో నేర్పింది.. మీ సినిమాలను మేము విజిల్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తామ్.. ఇంతకంటే మీ గురించే నేనేమ్ చెప్పగలను.

Manchu Manoj Emotional Tweet On 20 Years Of Puri Jagannadh

ఇండస్ట్రీకి వచ్చి ఇరవై యేళ్లు అయిన సందర్భంగా కంగ్రాట్స్.. మీరింకా ఎన్నో అద్భుతమైన చిత్రాలను పక్కా మాస్ మసాలా సినిమాలను మాకు అందించాలని కోరుకుంటున్నా'ని పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన పూరి.. ఇది నన్నెంతో టచ్ చేసింది మనోజ్.. థ్యాంక్యూ సో మచ్..లవ్యూ అంటూ రిప్లై ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X