గుద్దితే పడేది నువ్వే, కూల్.. ఆ ఛానల్ యాంకర్‌కు సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్ దిమ్మతిరిగే కౌంటర్!
Recommended Video

మీడియా ఛానల్స్ లో చూపించేదంతా నిజం అని నమ్మే రోజులు పోయాయి. బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతుందో అంచనా వేయగలిగే చైతన్యం సగటు పౌరుడిలో కలుగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్ధం ప్రకటించడంతో ప్రజలు విశ్లేషించుకోవడం మొదలుపెడుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు గత 8 నెలల నుంచి ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నతో అందరికి తెలిసిందే. తన తల్లిని దూషించిన శ్రీరెడ్డి వీడియోని పదే పదే టెలికాస్ట్ చేయడం, డిబేట్లు పెట్టడంతో మియాద హద్దులు దాటుతోందని భావించిన పవన్ కళ్యాణ్ టివి9, టివి5, ఏబీఎన్ ఛానల్స్ పై యుద్ధం ప్రకటించారు. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ మీడియా సంస్థలపై తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై చిరంజీవి టాలీవుడ్ హీరోలతో అత్యవసర సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలో అలాంటి వారు లేరా
ఆ మధ్యన టివి5 యాంకర్ ఒకరు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో అలాంటి వారు లేరా అంటూ పేర్కొనలేని పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్‌పై కుట్ర
పవన్ కళ్యాణ్ తల్లిని పబ్లిక్ గా దూషిచడం, ఆ వీడియోల్ని కొన్ని మీడియా సంస్థలు అదేపనిగా ప్రసారం చేయడం, డిబేట్లు పెట్టి సగటు ప్రజలకు తీవ్రమైన విసుగు తెప్పించాయి. గత 8 నెలలుగా కొన్ని తెలుగు మీడియా సంస్థలు ఎలాంటి డిబేట్లు ప్రసారం చేస్తున్నాయో అందరికి తెలిసిందే. దీనితో పవన్ కళ్యాణ్ తన పై కుట్రగా భావించి సంచలన విషయాలు బయట పెట్టారు.

ఇండస్ట్రీని ఏకం చేసే ప్రయత్నం
చిత్ర పరిశ్రమని టార్గెట్ చేసేలా, అనవసరమైన విషయాలతో మీడియా ప్రజలకు విసుగుతెప్పించేలా ప్రవర్తిస్తోందని ఆయన నేరుగా సదరు టివి ఛానల్స్ పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసియందే. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇండీస్ట్రీని ఏక తాటిపై నిలబెట్టే ప్రయత్నం చేసారు.

మెగాస్టార్ రహస్య సమావేశం
ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఇటీవల అందుబాటులో ఉన్న స్టార్ హీరోలందరితో రహస్యంగా అన్న పూర్ణ స్టూడియోస్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వీరి మధ్య సంచలన ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. సదరు మీడియా సంస్థలని తెలుగు చిత్ర పరిశ్రమ బహిష్కరించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

మళ్లీ కవ్వించే మాటలు
టివి5 యాంకర్ తెలుగు చిత్ర పరిశ్రమని దూషించిన వ్యవహారం చల్లారక ముందే, అదే ఛానల్ కు చెందిన మరో యాంకర్ టాలీవుడ్ హీరోల గురించి సంచలన తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఉన్న హీరోలంతా సొంత డబ్బా కొట్టుకునే వారని యాంకర్ కామెంట్స్ చేసారు. సినిమాల్లో మాత్రమే ఫైట్స్ చేస్తారని, రియల్ లైఫ్ లో గుద్దితే పడిపోయే విధంగా ఉంటాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఘాటుగా స్పందించిన మంచు మనోజ్
ఆ యాంకర్ చేస్తున్నది బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమమా లేక కామెడీ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమమా అంటూ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా మండి పడ్డారు.ఒక్కటి గుద్దితే అంట.. నిజంగానేనా? గుద్దితే పడిపోయేది నువ్వే అంటూ యాంకర్ కు మనోజ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
సాయిధరమ్ తేజ్ పంచ్
మనోజ్ రిప్లైకు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా స్పందించాడు. తనదైన శైలిలో యాంకర్ కు పంచ్ విసిరాడు. బాబాయ్ మనోజ్.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











