పవన్ కళ్యాణ్ అన్నకు నేను తోడుగా ఉంటా.. మంచు మనోజ్ బహిరంగ లేఖ, వాళ్లెవరో నాకు తెలుసు!
Recommended Video

మంచు వారబ్బాయి హీరో మనోజ్ అందరితో ఎంత కలివిడిగా, సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. అదే సమయంలో మనోజ్ కు సామజిక స్పృహ కూడా ఉంది. మనోజ్ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటాడు. తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రగులుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి మజోజ్ తనదైన శైలిలో స్పందించాడు. సినిమా తల్లి బిడ్డని అంటూ బహిరంగ లేఖ విడుదల చేసి తానూ చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. జరుగుతున్న వివాదంపై మనోజ్ కు ఉన్న అవగాహన, విశ్లేషణ పరిజ్ఞానం ఈ లేక ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మనోజ్ లేఖలో పేర్కొన విషయాలు ఇప్పుడు చూద్దాం..

పారిపోయే వ్యక్తిని కాదు
టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల గురించి స్పందించాలని చాలా మంది నాకు సోషల్ మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా సందేశాలు పంపారు. మరో కొంత మంది అనవసరమైన వివాదాలు వద్దని, ఈ విషయంలో దూరంగా ఉంటె మంచిదని సలహా ఇచ్చారు. కానీ మీకందరికీ తెలుసు నేను సమస్యని విడిచిపెట్టి పారిపోయే వ్యక్తిని కాదు.

వాళ్లెవరో నాకు తెలుసు
ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి మనోజ్ తన లేఖలో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్న రాజకీయ నాయకులు, ఛానల్ సీఈవోలు, ఎండి గురించి తనకు తెలుసు అని మజోజ్ అన్నారు. ఈ వ్యవహారంలోకి వ్యక్తిగతంగా హీరోలని, నిర్మాతలని కూడా లాగారనే విషయాన్ని తాను గమనించానని మజోజ్ తనలేఖలో పేర్కొన్నాడు.

అలా చేయడం సరైంది కాదు
కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలు అని రంగాల్లో ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు, మీడియా, బ్యాంకింగ్ ఇలా అన్ని రంగాల్లో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. ఇంతకంటే ఘోరమైన పాపాలు కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. కానీ కేవలం కాస్టింగ్ కౌచ్ విషయంలో మాత్రమే ఇండస్ట్రీని తప్పుడు పడుతున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇలాంటి సమస్యల్ని నిర్ములించడానికి అందరం కలసి పనిచేద్దాం.

పవన్ కళ్యాణ్ అన్నకు తోడుగా
పవన్ కళ్యాణ్ అన్న ఓ ట్వీట్ చేసారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళల హక్కుల గురించి పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆయనకు నేను తోడుగా ఉంటా. కానీ నాపోరాటం కేవలం ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు మాత్రమే పరిమితం కాదు.

సినిమా అమ్మకు చెందిన కుటుంబం
మనమంతా సినిమా అమ్మ కుటుంబానికి చెందిన వరమని మనోజ్ అన్నాడు. అంతా కలసి ఉండాలని అభిప్రాయ పడ్డాడు. ఈ వ్యవహారంలో ఎక్కువగా మాట్లాడడం కంటే సైలెంట్ గా ఉంటె పరిస్థితులు చక్కబడుతాయి. మెరిసేదంతా బంగారం కాదు, మీరు చూస్తున్నది, మీకు చూపించ బడుతున్నది అంతా నిజం కాదని మనోజ్ అభిప్రాయపడ్డాడు.
మీడియాకు సూచన
ఇలాంటి సమస్యని మీడియా సభ్యత సంస్కారంతో హ్యాండిల్ చేసి ఉండాల్సింది. అనవసరమైన విషయాలతో అందరికి ఇబ్బందులు కలిగించవద్దు. తమ లక్ష్యం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడమే అని మనోజ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











