సెన్సార్ పూర్తి చేసుకున్నా ‘మెహబూబా’, ఎగ్జైట్మెంటుతో చార్మీ ట్వీట్!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. మే 11న సమ్మర్ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.
ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ వీడియో ట్వీట్ చేశారు. తమ సినిమా సెన్సార్ పూర్తయిందని, చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. సెన్సార్ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పింది. ఆకాశ్ చాలా బాగున్నాడని, లవ్ స్టోరీ చాలా బాగుందని సెన్సార్ సభ్యులు తమతో చెప్పడం మరింత ఎనర్జీ ఇచ్చిందన్నారు.

1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేయడంపై సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా వార్ సీన్లు, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆకాష్ పూరికి నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. 'దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది, ఆ మనసులో ఓ చిన్న స్థానం దొరికినా చాలు', 'మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం' అంటూ ట్రైలర్లో హీరో హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ, యాక్షన్: రియల్ సతీష్, ఆర్ట్: జానీ షేక్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











