‘మెహబూబా’ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. మే 11న సమ్మర్ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేయడంపై సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Recommended Video

ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 'బ్లూ స్కై సినిమా' వారు దక్కించుకున్నారు. చిత్రాన్ని యూఎస్ఏతో పాటు ఇతర ఓవర్సీస్ లొకేషన్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ఏలో మే 10న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.

మెహబూబా టీం మే 10 నుండి మే 24 వరకు యూఎస్ఏలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. మే 10న న్యూజెర్సీలో జరిగే ప్రీమియర్ షోకు హాజరవ్వడం ద్వారా వీరి ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. హీరో, హీరోయిన్‌తో చిత్ర బృందం ఈ పర్యటనలో పాల్గొంటారు.
ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో ఆకాష్ పూరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా వార్ సీన్లు, యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆకాష్ పూరికి నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. 'దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది, ఆ మనసులో ఓ చిన్న స్థానం దొరికినా చాలు', 'మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం' అంటూ ట్రైలర్లో హీరో హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ, యాక్షన్: రియల్ సతీష్, ఆర్ట్: జానీ షేక్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











