18వేల అడుగుల ఎత్తులో దూల తీరిపోతోంది: పూరీ జగన్నాధ్
ఛార్మి మెహబూబా షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియో ట్వీట్ చేసింది. వీడియోలో మెహబూబా టీం "18వేల అడుగుల ఎత్తులో.. మైనస్ టెంపరేచర్‌లో.. స్నో ఫాల్‌లో.. దూల తీరిపోతోంది." అని పూరి సరదాగా కామెంట్ చేసాడు .
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన ఈ డాషింగ్ డైరెక్టర్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ముందునుంచి అనుకుంటున్నట్టుగానే తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ సినిమాను తెరకెక్కించనున్నాడు.

మెహబూబా
మంగళూరు మోడల్ నేహా శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. హిమాచల్, పంజాబ్, రాజస్థాన్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా పూరీ స్టైల్ నే కొత్తగా మార్చేసే మేకింగ్ తో వస్తుందీ అన్న టాక్ రావటంతో ఈ సినిమా కోసం ఇటు ఇండస్ట్రీ వర్గాలు, అటు కామన్ ఆడియెన్ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రెండు జన్మలుంటాయి
ఈ కథలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ రెండు జన్మలుంటాయని, గతంలో చనిపోయిన ఇద్దరూ మళ్ళీ ప్రస్తుతంలో పుట్టడం వంటి ఆసక్తికరమైన పాయింట్ ఈ కథలో ఉందని సమాచారం. మరి పూరి ఈ ఆసక్తికరమైన కథను తన టేకింగ్ తో ఇంకెంత ఆసక్తికరంగా తెరకెక్కిస్తారో చూడాలి.

టీమ్ మొత్తం హిమాచల్‌ప్రదేశ్‌లో
ఇవి పక్కన పెడితే ఎలాంటి గ్యాప్ లేకుండా అలవాటు ప్రకారం స్పీడ్ ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేసేస్తూనే ఉన్నాడు పూరీ... ఇప్పుడు ఈ టీమ్ మొత్తం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఈ సందర్భంగా అక్కడ పూరి చిత్ర బృందం దిగిన ఫోటోను.. 29సెకన్ల వీడియోను ఛార్మి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
దూల తీరిపోతోంది
"హిమాచల్ పర్వతంపై.. 18వేల అడుగుల ఎత్తులో.. -7డిగ్రీల చలిలో మహబూబా చిత్ర బృందం" అంటూ ఛార్మి ట్వీట్ చేశారు. వీడియోలో పూరి జగన్నాథ్.. మెహబూబా టీం "18వేల అడుగుల ఎత్తులో.. మైనస్ టెంపరేచర్‌లో.. స్నో ఫాల్‌లో.. దూల తీరిపోతోంది." అని పూరి సరదాగా కామెంట్ చేసాడు ఆ వీడియోలో..


Click it and Unblock the Notifications











