Liger ‌లో మైక్ టైసన్.. విజయ్ దేవరకొండతో కలిసి.. పూరీ జగన్నాథ్ అదిరిపోయే ప్లాన్!

యాంగ్రీ యంగ్ మ్యాన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు పెంచుతున్నది. ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ీ చిత్రం కరోనావైరస్ కారణంగా వాయిదా పడతూ వస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నది. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా కీలక సన్నివేశాలను దర్శకుడు పూరీ జగన్నాథ్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ నటించబోతున్నారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఆ వివారాల్లోకి వెళితే..

అర్జున్ రెడ్డితో ఓవర్‌నైట్‌ స్టార్

అర్జున్ రెడ్డితో ఓవర్‌నైట్‌ స్టార్

అర్జున్ రెడ్డి చిత్రంతో దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్‌లోనే సెన్సేషనల్ హీరోగా విజయ్ దేవరకొండ మారిపోయాడు. భాషకు సంబంధం లేకుండా విజయ్ దేవరకొండను, అర్జున్ రెడ్డిని ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలకు, ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రతీ సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకొంటూ వెళ్తు ఉన్నారు.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం

గతంలో అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్‌‌ చేసినప్పుడు బాలీవుడ్‌లోకి ప్రవేశించే అవకాశం వచ్చింది. అయితే రీమేక్ చిత్రాల్లో నటించకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత షాహీద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ చిత్రం హిందీలో రీమేక్ అయి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

లైగర్‌తో ప్యాన్ ఇండియా హీరోగా

లైగర్‌తో ప్యాన్ ఇండియా హీరోగా

అయితే ప్రస్తుతం లైగర్ అనే చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ముంబైలో షూటింగు జరుపుకొన్నది. కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడం రిలీజ్ కూడా వాయిదా వేశారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను గోవాలో విజయ దేవరకొండపై చిత్రీకరిస్తున్నారు.

బాక్సింగ్ క్రీడా నేపథ్యంగా

బాక్సింగ్ క్రీడా నేపథ్యంగా

ఇక లైగర్ చిత్రం బాక్సింగ్ కథా నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్‌తోపాటు భారీగా కండలు పెంచారు. బాక్సర్ పాత్రలో ఒదిగిపోయేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రంలో మైక్ టైసన్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ రంగంలోకి దించుతున్నట్టు సమాచారం.

మైక్ టైసన్ ఎంట్రీతో

మైక్ టైసన్ ఎంట్రీతో

ఇదిలా ఉండగా, కథ డిమాండ్ మేరకు లైగర్ చిత్రంలో ప్రీ క్లైమాక్స్‌కు ముందు మైక్ టైసన్ ఎంట్రీ ఇస్తారనే విషయం బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండకు సంబంధించిన కీలక ఎపిసోడ్‌లో మైక్ టైసన్ ఎంట్రీ ఇచ్చి కథను మరో లెవెల్‌కు తీసుకెళ్తారనే విషయం ఆసక్తిని కలిగిస్తున్నది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ గోప్యంగా ఉంచుతున్నది. అయితే అభిమానులకు థ్రిల్ కలిగించేలా ఈ విషయాన్ని వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
ఎంఎంఏ ఫైటర్‌గా విజయ్ దేవరకొండ

ఎంఎంఏ ఫైటర్‌గా విజయ్ దేవరకొండ

థాయ్‌లాండ్‌లో అత్యంత ప్రాచుర్యం ఉన్న బాక్సింగ్ క్రీడకు సంబంధించి ఎంఎంఏ ఫైటర్‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను త్వరలోనే మైక్ టైసన్, విజయ్ దేవరకొండపై గోవాలో చిత్రీకరించేందుకు సిద్దం అవుతున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మక్రంద్ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X