రామ్‌చరణ్ కోసం రంగంలోకి దిగబోతున్న మోహన్‌లాల్?
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక భారీ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కి ఇది 15వ సినిమా కాగా, దిల్ రాజుకి ఇది 50వ సినిమా అవుతుంది. కథానాయికగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణను ఈ సినిమా పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మోహన్ లాల్ పేరును పరిశీలిస్తున్నట్టు కొద్దిరోజుల నుంచి వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ ఆయన్నే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెకండాఫ్ లో మోహన్ లాల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, ఆయన క్యారెక్టర్‌ను చాలా పవర్ ఫుల్‌గా శంకర్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు మోహన్ లాల్ కి పారితోషికం భారీగా ముట్టిందంటున్నారు.
రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక పాత్ర గ్రామీణ నేపథ్యంలో నడిచేదికాగా, మరోపాత్ర సిటీ నేపథ్యంలో స్టైలిష్‌గా కనిపించబోతోంది. ఈ రెండు పాత్రల మధ్య ఉండే వైవిధ్యాన్ని శంకర్ బాగా చూపించబోతున్నారని ఈ చిత్రవర్గాల నుంచి సమాచారం అందుతోంది. శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నిర్మాత దిల్ రాజు తన బ్యానర్‌కు ప్రతిష్టాత్మకంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో 50వ చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నారు. శంకర్ సినిమా అంటేనే రిచ్‌నెస్ బాగా కనపడుతుందని, అంతకు మించి ఖర్చు చేయడానికి కూడా దిల్ రాజు సిద్ధపడినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీలో విడుదల చేయబోతున్నారు. అవకాశాన్ని బట్టి బెంగాలీలో విడుదల చేయాలనే యోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











