»   » శ్రీరెడ్డిపై మురళి మోహన్ సంచలనం.. హిందూ ధర్మాన్ని మరచింది, పానకంలో పుడక, చాలా పెద్ద తప్పు!

శ్రీరెడ్డిపై మురళి మోహన్ సంచలనం.. హిందూ ధర్మాన్ని మరచింది, పానకంలో పుడక, చాలా పెద్ద తప్పు!

Subscribe to Filmibeat Telugu
Murali Mohan Sensational Comments On Sri Reddy

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం రోజు రోజుకూ ఉదృతం అవుతూనే ఉంది. శ్రీరెడ్డి తో పాటు క్యాస్టింగ్ కౌచ్ ఘటనలకు గురైన చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు మీడియా ముందుకు వచ్చిన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శ్రీరెడ్డి బడా సినీ ప్రముఖుల పేర్లు బయట పెడుతున్న సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ లో కలకలం రేగుతోంది. శ్రీరెడ్డికి కొంత మంది నుంచి మద్దత్తు లభిస్తుంటే మరి కొంత మంది నుంచి వ్యతిరేకత వస్తోంది. శ్రీరెడ్డి వివాదం గురించి సినీ నటుడు, ఎంపీ మురళి మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓయ్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ శ్రీరెడ్డి వివాదం గురించి స్పందించారు.

 మా అసోసియేషన్‌లో అలా కుదరదు

మా అసోసియేషన్‌లో అలా కుదరదు

మా అసోసియేషన్ లో అందరికి సభ్యత్వం ఇవ్వడం కుదరదని మురళి మోహన్ అన్నారు. శ్రీరెడ్డి ఎవరో తెలియదు, ఎన్ని చిత్రాల్లో నటించిందో కూడా తెలియదని వ్యాఖ్యానించారు.

 అందరూ వస్తున్నారు

అందరూ వస్తున్నారు

జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టాలని కానీ మాలో తక్కువ ఫీజు ఉండడంతో అందరూ ఇందులోనే సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని మురళి మోహన్ అన్నారు. అందు వలన కోరిన వారందరికీ సభ్యత్వం ఇవ్వడం కుదరదని అన్నారు. అసలు శ్రీరెడ్డి సభ్యత్వానికి అప్లై చేసిందో లేదో కూడా తెలియదని అన్నారు.

చాలా పెద్ద తప్పు

చాలా పెద్ద తప్పు

ఒకవేళ శ్రీరెడ్డికి నిజంగానే సభ్యత్వం నిరాకరించబడినా ఆమె పబ్లిక్ లో వివస్త్రగా మారడం చాలా పెద్ద తప్పు అని మురళి మోహన్ అన్నారు. హిందూ ధర్మాన్ని మరచి ఇలా చేయకూడదని అన్నారు. ఇది అంతా సిగ్గు పడాల్సిన విషయం అని అన్నారు.

అక్కడితో ఆపకుండా ఏంటిది

అక్కడితో ఆపకుండా ఏంటిది

ఇండీసెంట్ ఇన్సిడెంట్ జరిగిన తరువాత అక్కడితో ఆపకుండా మీడియాలోకి పిలవడం, డిబేట్లు పెట్టడం తనకు మనస్థాపం కలిగించిందని మురళి మోహన్ అన్నారు.

శ్రీరెడ్డికి ఏమైనా ఒరిగిందా

శ్రీరెడ్డికి ఏమైనా ఒరిగిందా

ఇలాంటి నిరసన తెలపడం వలన శ్రీరెడ్డికి ఏమైనా ఒరిగిందా అని మురళి మోహన్ ప్రశ్నించారు. శ్రీరెడ్డి వలన అందరికి నష్టం జరిగిందని అన్నారు. శ్రీరెడ్డికి ఎదురైనా కష్టాలు ఆమె వ్యక్తిగతం అని మురళీమోహన్ అన్నారు. ఆ విషయాలు బయట పెట్టడం వలన ఆమెకు హీరోయిన్ గా అవకాలు వచ్చాయా అని మురళి మోహన్ ప్రశ్నించారు.

పానకంలో పుడక

పానకంలో పుడక

శ్రీరెడ్డి వివాదం అంత పెద్దదికాదని, కేవలం పానకంలో పుడక మాత్రమే అని అన్నారు. దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు.

English summary
MP Murali Mohan responds on SriReddy issue. He made sensational comments on SriReddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X