దేవి శ్రీ ప్రసాద్ కూడా భయపడుతున్నాడు.. 40లోకి వచ్చినా పెళ్లొద్దట..ఎందుకంటే?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లుగా మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. యుక్త వయసులోనే తన పాటలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దేవి టచ్ చేయని హీరో లేడు. దాదాపు టాలీవుడ్ కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేసేశాడు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాకు తగ్గట్టుగా మ్యూజిక్ అందించడంలో దేవి స్టైలే వేరు. ఇకపోతే ఈ రాక్ స్టార్ పెళ్లికి సంబంధించిన కొన్ని రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

PSPK28 movie update: గబ్బర్ సింగ్ రిలీజ్ రోజే మళ్లీ ఆ ఇద్దరితో

 అసలైన రాక్ స్టార్.

అసలైన రాక్ స్టార్.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అంటే పసి పిల్లాడి నుంచి వృద్ధుల వరకు అందరూ ఒకే ఊపులో చిందేస్తారు. అంత స్టైలిష్ గా పాటలను కపోజ్ చేయగల దేవి ఇప్పటివరకు ఎలాంటి కాంట్రావర్సిలు లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పోటీగా ఎంతమంది సంగీత దర్శకులు వచ్చినా కూడా తనదైన శైలిలో సాంగ్స్ అందిస్తూ పోటీని ఇస్తున్నాడు.

 సంగీతంతోనే లైఫ్.

సంగీతంతోనే లైఫ్.

మరో రెండు నెలలు గడిస్తే.. దేవి శ్రీ ప్రసాద్ 41లోకి వచ్చేస్తాడు. అయితే ఎందుకో గాని ఈ రాక్ స్టార్ పెళ్లి అంటేనే దూరంగా వెళ్లిపోతున్నాడు. పుట్టినప్పటి నుంచి ఎక్కువగా సంగీతంతోనే లైఫ్ ని కొనసాగిస్తున్నాడు. మంచి మ్యూజిక్ అందించాలని ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నాడు. పెళ్లికి దూరంగా ఉంటూ సినిమాలకు మరింత దగ్గరవాడుతున్న దేవి పెళ్లిపై ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చాడు.

 ఆ ఒక్కటి అడగకండి..

ఆ ఒక్కటి అడగకండి..

లాక్ డౌన్ లో నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన ట్యూన్స్ సిద్ధం చేస్తున్న దేవి ఇక ఇంటర్వ్యూలో పెళ్లి పై మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడ లేదు. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు.. ఇంతవరకు ఎందుకు చేసుకోలేదు అంటే.. అలాంటి ప్రశ్నలు అడగవద్దని సమాధానం ఇచ్చాడు. ఆ ఒక్క సమాధానంతో పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని దేవి చెప్పకనే చెప్పాడు.

ప్రయత్నాలు చేశారట

ప్రయత్నాలు చేశారట

దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు చాలా సార్లు ప్రయత్నాలు చేశారట. కానీ కెరీర్ సాకుతో ఎప్పటికప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ రాగాలు తీస్తున్నాడట. దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు. ఆయన సోదరి కూడా పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చింది. మరో వైపు థమన్ కెరీర్ ని ఒక ట్రాక్ లో సెట్ చేసుకుంటూనే తన ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. మరి దేవి శ్రీ ప్రసాద్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X