ఆ హీరోకి నాకు కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.. మా నాన్నకు ఫిర్యాదు చేశారు: నభా నటేష్
'నన్ను దోచుకుందువటే' ద్వారా యువ హృదయాలను ఇట్టే దోచేసింది యంగ్ హీరోయిన్ నభా నటేష్. అందాలు ఆరబోయడం, అభినయంలో ఆకట్టుకోవడం రెండింటిలో కూడా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంటున్న ఈ భామ ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తోంది. జులై 18న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నభా నటేష్ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
కథలో భాగంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ ని కొట్టే సన్నివేశం ఒకటి ఉందట. ఈ సన్నివేశంలో రామ్‌ని కొట్టడానికి తాను భయపడుతుంటే పూరి జగన్నాథ్ ఎంకరేజ్ చేసి మరీ కొట్టించాడట. పూరి జగన్నాథ్ తో పని చేయడం చాలా సులువుగా అనిపిస్తుందని.. అలాగే రామ్, పూరి చాలా కోపరేటేడ్‌గా ఉన్నారని నభా నటేష్ చెప్పుకొచ్చింది. రామ్‌కి, నాకు నాకు కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.

ఇక ఈ సినిమాలో తాను తెలంగాణ యాసలో అదరగొట్టేస్తానని అంటోంది నభా. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా యాస నేర్చుకుందట. తన పాత్ర చాలా అల్లరల్లరిగా ఆకట్టుంటుందని చెప్పిన ఆమె.. తన కాలేజీ రోజుల విషయాలు కూడా చెప్పింది. తాను కాలేజీలో కూడా బాగా అల్లరి చేసేదాన్ని
అని, కొన్నిసార్లు కొందరు ఆ విషయం గురించి మా నాన్నకు కూడా ఫిర్యాదు చేశారని పేర్కొంది నభా నటేష్.
పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ మార్క్‌లో రూపొందింది 'ఇస్మార్ట్ శంకర్' సినిమా. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేశారు. జులై 18వ తేదీ నుంచి పూరి స్టైల్‌లో ఈ ముగ్గురి రొమాన్స్ చూడనున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.


Click it and Unblock the Notifications











