»   »  షాకైన నాగబాబు.... అన్నయ్య గురించి ఏమన్నాడో తెలుసా?

షాకైన నాగబాబు.... అన్నయ్య గురించి ఏమన్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెం 150 చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రూ. 100 కోట్ల సినిమాగా నిలిచి మెగా పవర్ ఎలా ఉంటుందో నిరూపించింది.

అన్నయ్య సినిమాకు ఈ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని నాగబాబు ఊహించలేదట. అన్నయ్యను అభిమానులు బాగా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నాం కానీ... ఈ రేంజిలో రెస్పాన్స్ ఉంటుందని నేను ఊహించలేదు, షాకయ్యాను అని నాగబాబు తెలిపారు.

ఖైదీ నెం 150 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి షాకయ్యాం. మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఆయన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్నయ్య అందరి వాడు అని మరోసారి రుజువైంది. ఆయన తెలుగు ఇండస్ట్రీ కింగ్ లేదా బాద్ షా అని చెప్పుకోవచ్చు అంటూ నాగబాబు పేర్కొన్నారు.

 ఇన్నాళ్లు మిస్సయ్యాం

ఇన్నాళ్లు మిస్సయ్యాం

అన్నయ్య మా అందరికీ ఐకాన్. మా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. అన్నయ్య సినిమా కోసం అభిమానులు ఎలా ఎదురు చూసారో మేము కూడా అలాగే ఎదురు చూసాం. సినిమా రిలీజ్ అయ్యాక అన్నయ్యను చూసి థ్రిల్లయ్యాం. అన్నయ్య పాలిటిక్స్ లోకి వెళ్లడం వల్ల ఇన్నాళ్లు ఆ థ్రిల్ మిస్సయ్యాం అని నాగ బాబు తెలిపారు.

 రాజకీయాలకు దూరం అవుతారా?

రాజకీయాలకు దూరం అవుతారా?

మరి అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చారు, ఇక రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లేనా? అనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ...అన్నయ్య సినిమాల్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు. అలా అని ఆయన రాజకీయాల్లోకి దూరం అవుతారని చెప్పలేను అని నాగ బాబు తెలిపారు.

 ఖైదీ నెం 150.... 16 రోజుల కలెక్షన్ వివరాలు

ఖైదీ నెం 150.... 16 రోజుల కలెక్షన్ వివరాలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150వ చిత్రం మూడో వారంలోనూ బాక్సాఫీసు వద్ద సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 16 రోజులు పూర్తి చేసుకుని రూ. 95.65 కోట్ల...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్!

నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్!

నాన్న కోసం... అనుష్కను లైన్లో పెడుతున్న రామ్ చరణ్. అలా అని మరోలా అనుకోవద్దు.... చిరంజీవి 151వ సినిమాను కూడా రామ్ చరణే నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Response for 'Khaidi No.150' is a shock to Me. It's 10 times more than the expectations. None of the political aspects had an impact on 'Khaidi No.150' in any way. That's a fact! Everybody received him and he has become Andarivadu again." Nagababu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu