శివమణి డైలాగ్స్ పేరడీ.. ఒకవేళ ఇప్పుడు చేసి ఉంటే ఇలాగే ఉండేదేమోనన్న నాగ్

పూరీ జగన్నాద్ ప్రతీ సినిమా ఓ ప్రత్యేకమే. ప్రతీ హీరోలోనూ డైలాగ్, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజాన్ని మార్చేసి కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుంటాడు పూరి. నాగార్జునకు అప్పటి వరకు ఇమేజ్‌ను రెట్టింపు చేసేలా శివమణి సినిమాను మలిచాడు. అందులోని డైలాగ్స్, నాగార్జున ఆటిట్యూడ్, బాగీ లాంగ్వేజ్, శివమణి క్యారెక్టరైజేషన్ ఇలా ప్రతీ ఒక్కటి అప్పట్లో ట్రెండ్ అయ్యాయి. ప్రత్యేకంగా అందులో పూర్ణ మార్కెట్‌లో రౌడీలకు వార్నింగ్ ఇచ్చే సీన్ ఎంతగానే స్పెషల్. ఇప్పుడదే సీన్‌ను ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా పేరడీ రూపంలో చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

నా పేరు శివమణి నాక్కొంచెం మెంటల్.. ఇప్పటి మీరేం చేశారో నేను అడగను.. కానీ ఇకనుంచి మానేయాలి.. సడెన్‌గా మానేయమంటే మీకు కష్టం అవుతుంది.. అయినా పర్లేదు అంటూ నాగ్ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చే సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్‌ను ప్రస్తుత పరిస్థితికి, తగ్గట్టు పేరడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నాగార్జున కంట పడింది. దీన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.

Nagarjuna Sivamani Peradi Dialogues On Corona

నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్.. పూర్ణ మార్కెట్ ఇంతవరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారు అని నేను అడగా.. సోషల్ డిస్టెన్స్ పాటించడం కష్టమే కానీ పాటించండి.. అంటూ అదిరిపోయే పేరడి చేశారు. ఈమేరకు నాగ్ కామెంట్ చేస్తూ.. ఒక వేళ ఈ సినిమా ఇప్పుడు తీసి ఉంటే..ఇవే డైలాగ్స్ ఉండేవేమోనని ట్వీట్ చేశాడు. మీరూ ఓ సారి ఆ వీడియోపై లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X