twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్, వర్మ సినిమా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కి కాపీ? కథ తెలుసా?

    |

    Recommended Video

    నాగ్, వర్మ మూవీ ఆ బ్లాక్‌బస్టర్‌కి కాపీ నా ? కథ తెలుసా?

    శివ చిత్రం విడుదలై సుమారు పాతికేళ్లు దాటినా ఆ చిత్రం గురుంచి ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటాం.. పరిశ్రమలో ఆ చిత్రం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథను ప్రేక్షకులకు చెప్పే విధానాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ తరువాత కూడా వీరిద్దరూ అంతం, గోవిందా గోవిందా చిత్రాలకు కలిసి పనిచేశారు. ఆ తరువాత సుమారు 24సంవత్సరాల తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నాడు.

    నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్

    నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్

    ఈ క్యారెక్టరైజేషన్ నచ్చడంతోనే నాగ్ వెంటనే కథకు ఓకె చెప్పాడట. అందరూ అనుకుంటున్నట్లు, ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓకె అయినది కాదుట. కొద్ది నెలలుగా దీనిపై డిస్కషన్లు నడుస్తున్నట్లు వినికిడి. ఆర్జీవీ తీయడం ఎలా తీస్తాడో కానీ, స్క్రిప్ట్, నాగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మాత్రం సూపర్ గా సెట్ అయ్యాయని తెలుస్తోంది.

    హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ

    హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ

    అందుకే నాగ్ ఒకె అనడం, సినిమా ప్రారంభం కావడం జరిగిపోతోంది. మరి వర్మ చూపించే పోలీస్ ఆఫీసర్ గా నాగ్ ఎలా వుంటాడో చూడాలి. అయితే ఈ సినిమా మీద వచ్చిన వార్త కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా సినిమా కథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణగా పొంది వర్మ తెరకెక్కించబోతున్నాడని గట్టిగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

     టేకెన్ అనే సినిమా తరహాలో

    టేకెన్ అనే సినిమా తరహాలో

    2008 లో హాలీవుడ్ లో వచ్చిన టేకెన్ అనే సినిమా తరహాలో ఉండబోతుందట. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండే ఆ సినిమాలో లియం నీసన్ హీరో. కిడ్నాప్ అయినా తన కూతురిని ఎక్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఎలా రక్షించుకున్నడు అనేది అసలు కథ. హాలీవుడ్ లో ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

    పోలీస్ ఆఫీసర్‌గా

    పోలీస్ ఆఫీసర్‌గా

    అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వర్మ కూడా స్టోరీని రెడీ చేసుకున్నాడని కొందరు చెబుతున్నారు. కానీ నాగ్ మాత్రం ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేసినపుడు సినిమా చాలా కొత్తగా ఉండనుందని ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు చెప్పాడు. ఇక వర్మ కూడా మైండ్ దొబ్బిన మాట నిజమే కానీ అసలు మ్యాటర్ అలానే ఉంది అనే విధంగా స్పీచ్ ఇచ్చాడు మరి ఏ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి.

    English summary
    Speculations are rife that the RGV flick with Nagarjuna is a copy of Hollywood hit film "Taken" (2008), which had Liam Neeson in the lead. Nagarjuna will be seen playing a Police Officer in the movie which Neeson did in the original.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X