లైగర్‌తో లయన్: విజయ్ దేవరకొండను సర్‌ప్రైజ్ చేసిన బాలకృష్ణ.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించగానే!

గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య స్నేహ సంబంధాలు విస్తృత స్థాయిలో పెరిగాయి. అందుకే ఒకరి సినిమాల ఫంక్షన్లకు మరొకరు హాజరు కావడం.. మూవీలు బాగుండే అభినందించడం వంటివి చేస్తున్నారు. తద్వారా పరిశ్రమలో మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. హీరోల మధ్య ఇలాంటి సంబంధాలు ఉండడం వల్లే అభిమానులు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. విజయ్ దేవరకొండను సర్‌ప్రైజ్ చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

‘అఖండ'తో రాబోతున్న బాలయ్య

‘అఖండ'తో రాబోతున్న బాలయ్య

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రమే 'అఖండ'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

గోవాలో సందడి చేస్తున్న నటసింహా

గోవాలో సందడి చేస్తున్న నటసింహా

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. పలు ఆటంకాల కారణంగా ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతూ వస్తోంది. అందుకే ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇటీవలే గోవా వెళ్లింది. అక్కడ పలు లవ్ సీన్స్‌తో పాటు పాటలను షూట్ చేస్తున్నారు. ఇది చివరి షెడ్యూల్ అని సమాచారం.

 విజయ్ దేవరకొండ కూడా గోవాలోనే

విజయ్ దేవరకొండ కూడా గోవాలోనే

సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని చార్మీ, పూరీతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ కూడా గోవాలోనే వేగంగా జరుగుతోంది.

బాక్సింగ్ రింగ్‌లో కష్టపడుతోన్న స్టార్

బాక్సింగ్ రింగ్‌లో కష్టపడుతోన్న స్టార్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ ఇటీవలే గోవాలో మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే తెలిపింది. తాజాగా వదిలిన ఫొటోలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ రింగ్‌లో చెమటలు చిందిస్తూ కనిపించాడు. అలాగే, అతడు షర్ట్ లేకుండా విచిత్రమైన హెయిర్ స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. దీంతో మూవీపై ఆసక్తి నెలకొంది.

విజయ్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య

విజయ్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య

ఆరు పదుల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కుర్ర హీరోలతో ఆయన ఎంతో సరదాగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా గోవాలో షూటింగ్ జరుపుకుంటోన్న 'లైగర్' మూవీ సెట్స్‌కు వెళ్లారాయన. చెప్పా పెట్టకుండా అక్కడకు ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఆయన రాకతో విజయ్ దేవరకొండ షాక్ అయ్యాడని తెలిసింది.

ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో

ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో

'లైగర్' సెట్స్‌కు నందమూరి బాలకృష్ణ వెళ్లి చాలా సేపు సరదాగా గడిపారని తెలుస్తోంది. ఆయనకు ఈ మూవీ టీమ్ సభ్యులు అదిరిపోయే వెల్‌కం కూడా చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఇక, దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నందమూరి, విజయ్ అభిమానులు 'లైగర్‌తో లయన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Recommended Video

Raj Tarun New Movie Will Be Directed By Santo
ఆ పరిచయంతోనే బాలయ్య వెళ్లారట

ఆ పరిచయంతోనే బాలయ్య వెళ్లారట

గతంలో నందమూరి బాలకృష్ణ.. పూరీ జగన్నాథ్‌లో కలిసి 'పైసా వసూల్' అనే సినిమా చేశారు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఈ క్రేజీ కాంబోలో మరో మూవీ రాబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. పూరీతో ఉన్న స్నేహం కారణంగానే బాలయ్య 'లైగర్' సెట్స్‌కు వెళ్లారని అంటున్నారు. మొత్తానికి ఈ పిక్ ఫ్యాన్స్‌లో ఖుషీని నింపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X