For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హను రాఘవపూడి మల్టీస్టారర్ లో వీరే హీరోలు

    |

    తెలుగు చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుల్లో హ‌ను హను రాఘవపూడికి ఒక ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. ప్రేమకథలను మంచి ఫీల్ తో తెరకెక్కించడంలో ఆయన దిట్ట‌. త‌నపై మణిరత్నం ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతుండే హను రాఘవపూడి ఇటీవల సీతా రామంతో భారీ హిట్ కొట్టాడు. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి జ‌నాల నుంచి విశేషమైన స్పంద‌న వ‌చ్చింది. త‌ర్వాత ఏ సినిమా చేయ‌బోతున్నాడు అనే ఆస‌క్తి అంద‌రిలో క‌లిగేలా చేయ‌డ‌మే కాకుండా క‌థానాయ‌కులు కూడా త‌మ‌తో ఒక‌సినిమా చేస్తే బాగుండు అనే భావ‌న‌ను క‌ల్పించ‌గ‌లిగాడు. త‌న త‌దుప‌రి చిత్రంగా ఒక మ‌ల్టీస్టార‌ర్ ఉండ‌బోతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌డు వాటికి బ‌లం చేకూరుస్తూ నాని, శ‌ర్వానంద్ ఆ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌థానాయ‌కుల‌నేదానిపై ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

    ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథగా ఈ సినిమాను హ‌ను రాఘవపూడి తీర్చిదిద్దబోతున్నాడని, నానితో, శర్వాతో చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. కథ ప్రకారం హిందూ ముస్లిం మతాలకు సంబంధించి వ్యక్తులుగా వీరిని చూపించబోతున్నాడని, ఈసారి ప్రేమ కథను మతాలతో ముడిపెట్టి తీయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో ఈ ఇద్దరు హీరోలతో సినిమా చేసివున్నాడు. నానితో కృష్ణగారి వీరప్రేమగాథ, శ‌ర్వానంద్‌తో ప‌డిప‌డి లేచె మ‌న‌సు చిత్రాల‌ను చేశాడు. మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. వీరిద్ద‌రితో సినిమా చేయ‌డానికి ఒక పెద్ద నిర్మాణ సంస్థ కూడా ముందుకు వ‌చ్చింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

    nani and sarvanand heroes in Hanu Raghavapudis multistarrer

    సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టిన హ‌ను త‌ర్వాత సినిమాతో కూడా క‌చ్చితంగా హిట్ కొడ‌తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంద‌ని, విభిన్న‌మైన ప్రేమ క‌థాచిత్రాల‌ను తీసే హ‌ను రాఘ‌వ‌పూడికి ఈ త‌ర‌హా చిత్రాలు తీయ‌డం పెద్ద క‌ష్ట‌మేంకాదంటున్నారు. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు విభిన్న‌మైన ప్రేమ క‌థా చిత్ర‌మైనా క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించ‌లేద‌ని, ఈసారి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీలో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు మేళ‌వించి తీయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

    English summary
    It seems that Hanu Raghavapudi is going to make this film as a story between two friends, and discussions with Nani and Sharva have also been completed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X