2020లో ఇంకా ఏమేమీ చూడాల్సి వస్తుందో.. హమారా బజాజ్ అంటూ రానా ప్రేయసిపై నాని కౌంటర్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌ తీస్తే అందులో మొదటగా వచ్చే పేర్లు రానా, ప్రభాస్. వీరికి మూడు పదుల వయసు దాటి చాలా ఏళ్లు అవుతున్నాయి. పెళ్లి అనే ప్రస్థావన వస్తే అక్కడ కచ్చితంగా ప్రభాస్, రానా విషయం రావాల్సిందే. అయితే ఇక నుంచి రానాకు ఆ తలనొప్పి తగ్గిపోనుంది. ఎందుకంటే తన ప్రేమను ప్రేయసి అంగీకరించనట్టు ప్రకటించాడు. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు కూడా సిద్దమయ్యారు. ఈ మేరకు రానా ప్రకటనపై టాలీవుడ్ మొత్తం స్పందించింది.

Recommended Video

Nani Playing With His Son Arjun | Nani & His Son Cute Video

రానా ప్రేయసి గురించి ఆసక్తి..

రానా ప్రేయసి గురించి ఆసక్తి..

రానా తన ప్రేయసి పేరు మిహికా బజాజ్ అని మాత్రమే తెలిపాడు. ఇక ఆమె ఎవరా? అని అంటూ వెదుకులాట ప్రారంభించారు తెలుగు ప్రేక్షకులు. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. కాకపోతే ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే కంపెనీకి వ్యవస్థాపకురాలు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా సుపరిచితులు.

కదిలిన టాలీవుడ్..

కదిలిన టాలీవుడ్..

రానాకు తన ప్రేయసి ఓకే చెప్పేసిందని ప్రకటించిన మరు క్షణం ఆ వార్త వైరల్ అయింది. ఇక రానాకు కంగ్రాట్స్ చెబుతూ సినీతారలంతా ట్వీట్స్ చేశారు. రామ్ చరణ్, మంచు మనోజ్, రాజమౌళి, హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, క్రిష్, శోభు యార్లగడ్డ,అనుష్క, చిరంజీవి ఇలా సెలెబ్రిటీలంతా స్పందించారు

మంచు లక్ష్మీకి ముందే తెలుసా?

మంచు లక్ష్మీకి ముందే తెలుసా?

రానా తన ప్రేయసి గురించి ప్రకటించడం మంచు లక్ష్మీ స్పందిస్తూ.. ‘ఈ ప్రపంచం ఓ విషయం తెలుసుకోవాలని నేనెంత గానో ఎదురుచూస్తున్నా.. ఆ ఆనంద గడియలు వచ్చేశాయ్.. మీ ఇద్దరి పట్ల ఎంతో ఆనందంగా ఉంది.. గత కొన్ని రోజులుగా ఈ విషయాన్ని దాచుకుంటూ ఉన్న ఒత్తిడి మొత్తం వెళ్లిపోయింద'ని చెప్పుకొచ్చింది. ఈ లెక్కన రానా ప్రేయసి గురించి అత్యంత సన్నిహితులకు ముందే తెలుసన్న మాట.

ఇంకా ఏమేమీ చూడాల్సి వస్తుందో..

ఇంకా ఏమేమీ చూడాల్సి వస్తుందో..

రానా తన ప్రేయసికి సంబంధించిన ప్రకటనపై నాని స్పందిస్తూ.. ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో'ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. అంతేకాకుండా ఈ సందర్భంలో బజాజ్ కంపెనీకి సంబంధించిన పాత ప్రకటనను అంకితం చేస్తున్నట్టు తెలిపాడు. మిహిక బజాజ్‌ను హమారా బజాజ్ హమారా బజాజ్ అంటూ పరోక్షంగా ఆటపట్టించాడు. అనంతరం.. జోక్స్‌ పక్కకు పెడితే సూపర్‌ బాబాయ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ నాని టైమింగ్‌కు ముగ్దులవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X