ఎన్టీఆర్, చెర్రీ, బన్నీ ముగ్గురూ ఓకే.. కుదిరితే రెడీగా ఉన్నా: కోరిక బయటపెట్టిన నిధి అగర్వాల్
టాలీవుడ్‌లో అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ లతో రొమాన్స్ చేసి ఆకట్టుకున్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన చిందులేస్తోంది. రొమాంటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ భామ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనలోని రొమాంటిక్ కోణాన్ని బయటకు తీస్తూ కోరిక బయటపెట్టేసింది. టాలీవుడ్ హీరోల్లో తనకు ఎన్టీఆర్, చెర్రీ, బన్నీ అనే చాలా ఇష్టమని పేర్కొంటూ వారితో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
లేటెస్ట్ హీరోయిన్స్ అందరిలో కెల్లా ఘాటు అందాలతో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్ తాజాగా ఓ కార్యక్రమానికి విచ్చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉత్తమ డ్యాన్సర్లు ఉన్నారని, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీయార్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్బంగా నిధి అగర్వాల్ పేర్కొంది. కుదిరితే ఆ హీరోల సరసన నటించడానికి తాను రెడీ అని నిధి అంటోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ మూడో భాగం తీస్తే అందులో నటించాలని ఆశగా ఉందని నిధి పేర్కొనడం గమనార్హం. బాహుబలి మూడో భాగమే లేదని ఇప్పటికే రాజమౌళి ప్రకటించినప్పటికీ నిధి ఇంతలా ఆశ పడుతుండటం ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాను ఇష్టపడే హీరో ఎవరనే దానిపై స్పందించిన నిధి.. రణ్‌బీర్ కపూర్ అని సమాధానం చెప్పింది.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నిధి తన అందాలను ఆరబోస్తోంది. రామ్ సరసన నటిస్తున్న ఈ భామ అందాలు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అవుతాయని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ సంయుక్త సమర్పణలో రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది. జులై 12వ తేదీన ఇస్మార్ట్ శంకర్ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని దిమాక్ ఖరాబ్ అనే పాటలో నిధి, నభా అందాలు అబ్బురపరుస్తాయని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











