'ఇద్దరమ్మాయిలతో' లో అమలా పాల్ ఆ సీన్ తీసేసారా?
అయితే ఈ సీన్ తీసారని, అయితే ఎడిటింగ్ లో ఆ సీన్ ని తొలిగించారని మరో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అమలా పాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఆమె కత్తి పట్టుకున్న ఫోజ్ మాత్రం అంతటా ప్రచారమై సినిమాకు మాత్రం క్రేజ్ తెచ్చిందనటంలో సందేహంలో లేదు.
ఇక సినిమాకు నెగిటివ్ టాక్ రావటంతో ... చిత్రంలో సీన్స్ కోత మొదలైంది. మొదటిగా ఈ కోత బ్రహ్మానందం, అలీ సీన్స్ పై పడింది. అలీ,బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కు పూరీ జగన్నాధ్ సినిమాలు మొదటి నుంచి పెట్టింది పేరు. పోకిరి,సూపర్,చిరుత,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.
అయితే తాజాగా వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' ఆ సీన్స్ అసలు పండలేదు. అన్ని చోట్ల నుంచి ఈ సీన్స్ చెత్తాయని టాక్ వచ్చింది. దాంతో రియలైజ్ అయిన టీమ్ వెంటనే ఆ సీన్స్ పై కోత వేసారు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మి,అలీ ట్రాక్ పూర్తిగా ఎత్తివేసారు. ఉన్నంతంలో కాస్త బోర్ తగ్గి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












