వరుణ్ తేజ్ ‘లోఫర్’లో ఫారిన్ బ్యూటీ ఐటంసాంగ్
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు.
పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

నోరా పతేహి ఇప్పటికే టెంపర్, బాహుబలి, కిక్ 2 చిత్రాల్లో ఐటం సాంగ్స్ తో అదరగొట్టింది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ ఆమె సాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందని, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇందుకు సంబంధించిన సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్‌గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.


Click it and Unblock the Notifications











