»   » అన్నయ్యనుద్దేశించి ఎన్టీఆర్ అలా అనడంతో అంతా నవ్వారు

అన్నయ్యనుద్దేశించి ఎన్టీఆర్ అలా అనడంతో అంతా నవ్వారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : అన్నయ్య కళ్యాణ్ రామ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...అన్న గురించి మాట్లాడాలంటే ఎట్లా మొదలు పెట్టాలో ఎంటో తెలియదు. ఆయన నాకు ఎవ్రీథింగ్, గైడ్, ఫిలాసఫర్, మంచి వెల్ విషర్, మంచి స్నేహితుడు, కొన్ని సందర్భాల్లో నాకు మంచి గర్ల ఫ్రెండ్(సరదాగా నవ్వుతూ) ... అని ఎన్టీఆర్ అనడంతో సభలో నవ్వులు పూసాయి.

    ఇజం ఆడియో

    ఇజం ఆడియో

    నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సినిమా బిగ్ సీడీని నంద‌మూరి హ‌రికృష్ణ విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ ఆడియో సీడీల‌ను అందుకున్నారు.

    ఆయన కష్టం కళ్లారా చూసాను

    ఆయన కష్టం కళ్లారా చూసాను

    నిజంగా ఈ సినిమాకు ఆన్నయ్య పడ్డ కష్టం ప్రత్యక్షంగా చాలా సార్లు నేనూ చూడటం జరిగింది. కష్టం అంటే కేవలం ఆయన బాడీ గురించి కాదు, నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను, కానీ ఆయన స్వతహాగా, ఒక నటుడిగా పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆ కష్టం కోసమైనా... ఆ కష్టం చూసి నాకూ నమ్మకం కలిగింది అన్నారు ఎన్టీఆర్.

    కష్టపడితే ఫలితం ఎటూ పోదు

    కష్టపడితే ఫలితం ఎటూ పోదు

    ఆన్నయ్య కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రథమంగా ఇజం అనే సినిమా నిలబడుతుందని గట్టి నమ్మకం ఉంది. జెన్యూన్ గా కష్టపడితే దాని ఫలితం ఎక్కడికీ పోదు. అది విజయంగానే తిరిగి వచ్చి మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. అలాంటి విజయం తప్పుకండా ఇజం సినిమా ద్వారా కళ్యాణ్ అన్నకు దక్కుతుందని మనసా వాచా కర్మనా నమ్ముతున్నాను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు ఉన్టీఆర్.

    కత్తి కంటే కలం గొప్పది

    కత్తి కంటే కలం గొప్పది

    కత్తి కంటే కలం చాలా గొప్పది. నేను చిన్నప్పటి నుండి దాన్ని చూస్తూ వచ్చాను. దాని రుజువు చేసే సినిమా ఇజం. ఈ చిత్రం చిరస్థాయిగా ఆ కలం గురించి, దానికున్న బలం ఏమిటో ఈ చిత్రం ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తుందని ఆశిస్తూ...ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు ఎన్టీఆర్.

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ....

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ....

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ....పూరి గారి గురించి, సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఫిబ్రవరి 4న ఆయన సినిమా చేద్దామని చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఆయనతో ట్రావెల్ చేసాను. సినిమా రిలీజ్ తర్వాతే నేను మాట్లాడతాను. మీరందరూ చూసి తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇది నాకు 13వ సినిమా. ఈ సినిమాకు పని చేసిన టీం నా కెరీర్లోనే బెస్ట్ టీం. ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు ప్రతి రోజూ నేను షూటింగ్ వెళ్లి కష్టపడాలనే ఉత్సాహం పూరి సార్ ఇచ్చారు. సినిమా రిలీజైన వీక్ తర్వాత సార్ గురించి తప్పకుండా గంట మాట్లాడతాను. నా బెస్ట్ డైరెక్టర్. సినిమాకు సంబంధించిన ప్రతి మెంబర్ చాలా ఉత్సాహంగా చేసాం. ఆ ఎనర్జీ అంతా పూరిగారు ఇచ్చిందే. నాతో ఈ సినిమా చేసినందుకు థాంక్స్ సార్. ఈ రోజు హీరో అనూప్. గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. థాంక్స్ అనూప్. భాస్కర భట్ల గారు మంచి సాహిత్యం ఇచ్చారు. హీరోయిన్ అదితి ఆర్య చాలా బాగా చేసింది. టీం అందరికీ థాంక్స్. బెస్ట్ టీం. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను అన్నారు.

    టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అన్నాడు

    టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అన్నాడు

    టీజ‌ర్ చూసి ఏంట‌య్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అన్నారు అంటూ .... పూరి మాట్లాడిన పూర్తి స్పీచ్ కోసం క్లిక్ చేయండి.

    English summary
    NTR comments about Kalyan Ram at ISM audio launch. ISM Movie Audio Launch event held at Hyderabad. Nandamuri Harikrishna, Jr NTR, Nandamuri Kalyan Ram, Aditi Arya, Puri Jagannadh, Ali, Anup Rubens, Prakash Raj, BVSN Prasad, Dil Raju, Tanikella Bharani, Ravi Kumar Bhaskarabhatla, Ajay Ghosh, Nandamuri Mohana Krishna, Anasuya graced the event.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more