»   »  ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తోందా?

ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇజం సినిమా రిలీజైంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రాక పోయినా...ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్లాపుల్లో ఉన్న పూరికి ఇజం మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. సినిమా సినిమాకు ఎక్కువగా గ్యాప్ తీసుకోని పూరి... నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టారు. కథను సిద్ధం చేసేందుకు తనకు సెంటిమెంటుగా ఉన్న బ్యాంకాక్ కు వెళ్లారు. పూరి బ్యాకాంక్ వెళ్లగానే ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి మొదలైంది. ఎన్టీఆర్ తోనా? లేక మహేష్ తోనా? అనే ఉత్కంఠ నెలకొంది. పూరికి అందుబాటులో ఉన్న హీరోల లిస్టును బట్టి చూస్తే నెక్ట్ష్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెంపర్ తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. పూరి తారక్ కు ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా వినిపించాడట. కాన్సెప్టు తారక్ కు నచ్చడంతో పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడని సమాచారం. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

English summary
NTR - Puri third project is likely to flag off in the next month and the filming will start towards the end of this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu