twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆఫీసర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. ఇది నా డిమాండ్, పవన్ కళ్యాణ్ ఫాన్స్‌ని రెచ్చగొడుతున్న శ్రీరెడ్డి!

    |

    Recommended Video

    Sri Reddy Point Outs To Pawan Fans

    ఇది వరకే పవన్ కళ్యాణ్ పై అనవసరంగా దూషణలకు దిగి విమర్శలపాలైన శ్రీరెడ్డి మరో మారు అదే పద్దతిని అవలంబించింది. అసందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులని రెచ్చగొట్టే పని పెట్టుకుంది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్ట్ గమనిస్తే ఈ అభిప్రాయం కలగక మానదు. రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వస్తున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి రామ్ గోపాల్ వర్మ ప్రకటన చేసారు. అదే ప్రకటన శ్రీరెడ్డి చేస్తూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని రెచ్చగొట్టిన వైనం విమర్శలకు తావిస్తోంది.

     జూన్ 1 న రాబోతున్న ఆఫీసర్

    జూన్ 1 న రాబోతున్న ఆఫీసర్

    నాగార్జున, ఆర్జీవీ కాంబోలో వస్తున్న ఆఫీసర్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆఫీసర్ చిత్రం ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నాగ్ కనిపించబోతున్నాడు.

    ప్రీరిలీజ్ ఈవెంట్

    ప్రీరిలీజ్ ఈవెంట్

    ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు తేదీ ఖరారైంది. మే 28 న ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించబోతున్నారు. నాగార్జున అభిమానులంతా పాల్గొని వేడుకని విజయవంతం చేయాలని వర్మ కోరాడు.

    ఇది నా డిమాండ్

    ఇదే విషయాన్ని తెలియజేస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులని అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నాగార్జున అభిమానులంతా ఈ వేడుకకు హాజరు కావాలని వర్మ కోరితే, శ్రీరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరూ హాజరు కావాలని, పైగా ఇది డిమాండ్ అంటూ రెచ్చగొట్టింది.

    ట్రోల్ చేస్తున్నారంటూ గగ్గోలు

    ట్రోల్ చేస్తున్నారంటూ గగ్గోలు

    ఓ వర్గం మీడియాని పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ తో దుమ్ముదులిపి వదిలిపెట్టారు. అప్పటి నుంచి ఆ వర్గం మీడియా శ్రీరెడ్డిని దూరం పెట్టేసింది. దీనితో శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎంత గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రోల్ చేస్తుంరంటూ తరచుగా శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తాజగా శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ తో ఆమెపై విమర్శలు మరింతగా ఎక్కువవుతున్నాయి.

    English summary
    Officer movie prerelease date fix. SriReddy deamandig PK Fans to attend event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X