బాబోయ్.. శ్రీరెడ్డి బయోపిక్ వస్తోందట, మరో కాంట్రవర్సీ!
Recommended Video

తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీరెడ్డి ఎలాంటి సంచలనమో అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. సినీప్రముఖులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. తనకు తానుగా పలు వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని రోజుల క్రితం మీడియాలో శ్రీరెడ్డి విపరీతంగా పబ్లిసిటి పొందింది. ఆ తరువాత ఆ మీడియా సంస్థలే శ్రీరెడ్డిని దూరం పెట్టాడు. ఇటీవల తమిళ మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది.

హడావిడిలో శ్రీరెడ్డి కూడా
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ హడావిడి కొనసాగుతోంది. బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోలంతా బయోపిక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ హడావిడిలో శ్రీరెడ్డి కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీరెడ్డే స్వయంగా
ఈ బయోపిక్ లో శ్రీరెడ్డి తన పాత్రలో తానే నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతా నూతన నటీనటులతో శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం నుంచే శ్రీరెడ్డి మీడియాలో హైలైట్ అయింది. అంతకు ముందు శ్రీరెడ్డి కొన్ని చిత్రాల్లో మాత్రమే మెరిసింది.

రెడ్డి డైరీ
శ్రీరెడ్డి బయోపిక్ చిత్రానికి రెడ్డి డైరీ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నూతన దర్శకుడు అల్లావుద్దీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వచించబోతున్నట్లు తెలుస్తోంది.

స్టింగ్ ఆపరేషన్
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై స్టింగ్ ఆపరేషన్ తరహాలో ఈ చిత్రం సాగుతుందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇన్ని వివాదాలు సృష్టించిన శ్రీరెడ్డి, తన బయోపిక్ తో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











