నీ మొండితనం వల్లే అలా జరిగింది.. ఛార్మీపై పూరీ జగన్నాద్ కామెంట్

హీరోయిన్‌గా ఫేడవుట్ అవుతున్న క్రమంలో ఛార్మీ.. పూరి జగన్నాద్ గ్యాంగ్‌లో నిర్మాతగా కొత్త అవతారాన్ని ఎత్తింది. పూరి కనెక్ట్స్ బాధ్యతలను తీసుకుని ఎంతో సమర్దవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే కాలం కలిసి రాక వారు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఇక ఆశలన్నీ ఇస్మార్ట్ శంకర్‌పైనే పెట్టుకుని ఉన్నారు. ఎంతో నమ్మకంగా ఈ సినిమాకు ఉన్నదంతా ఊడ్చిపెట్టినట్టున్నారు. ఫలితం తేడా కొడితే వీరి పరిస్థితి ఏమయ్యేదో కానీ.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దశ తిరిగిపోయింది.

బ్లాక్ బస్టర్..

బ్లాక్ బస్టర్..

ఎక్కడో పోకిరి, బిజినెసెమేన్ వంటి చిత్రాల తరువాత అంతగా సక్సెస్ లేక ఆగిపోయిన పూరి జగన్నాద్‌కు ఇస్మార్ట్ ఊపిరిపోసింది. ఇస్మార్ట్ శంకర్ మాస్‌కు ఉన్న పవర్, కమర్షియల్ చిత్రాలకు ఉన్న స్టామినాను మరోసారి నిరూపించింది. పూరి జగన్నాద్, ఛార్మీలకు ఇస్మార్ట్ ఇచ్చిన బలం అంతా ఇంతా కాదు. ఏకంగా ప్యాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించేంత ధైర్యం వచ్చింది. నేటికి ఈ చిత్రం విడుదలై ఏడాది కావస్తుండగా.. పూరి ఎమోషనల్ అయ్యాడు.

నీ మొండితనమే..

నీ మొండితనమే..

ఇస్మార్ వార్షికోత్సవ సందర్భంగా సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ఈ సందర్భంగా పూరి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఛార్మీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘గత ఏడాది ఇదే రోజు ఓ పెద్ద పండగ.. ఎంతో కష్టపడే నా నిర్మాత ఛార్మీకి ధన్యవాదాలు. నీ మొండితనం వల్లే ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయింది. నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్.. చిత్రయూనిట్ మొత్తానికి థ్యాంక్స్' అని ఎమోషనల్ అయ్యాడు.

 ఏక్ సాల్ హోగయా..

ఏక్ సాల్ హోగయా..

ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఏడాది అయినందుకు రామ్ స్పందిస్తూ.. ‘మామా.. ఏక్ సాల్ హో గయా.. జయాపజయాల గురించి ఆలోచించకు.. అభిప్రాయాల గురించి అసలే ఆలోచించకు... నీకు నచ్చినట్టుగా, నిన్ను సంతోషంగా ఉంచే వాటి గురించి మాత్రమే ఆలోచించు.. ఇస్మార్ట్ శంకర్ నాకెప్పుడూ ప్రత్యేకమే' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Recommended Video

Vijay Devarakonda Gets Herat Touching Birthday Wishes
లిటిల్ బాస్..

లిటిల్ బాస్..

ఇస్మార్ట్ విజయం వెనుకున్న వారిని ప్రశంసించిన రామ్.. ‘ప్రతీ రోజూ ఎంతో కష్టపడి పని చేసిన మా లిటిల్ బాస్ నిర్మాత ఛార్మీకి థ్యాంక్స్.. హాట్ హాటర్ హాటెస్ట్ నిధిఅగర్వాల్‌, మై క్రేజీ చాందినీ మీరే ఫైర్.. సత్యదేవ్ చాలా ప్రతిభావంతుడైన నటుడు.. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించాడ'ని ప్రతీ ఒక్కరిని పొగిడాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X