శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ.. రాత్రి ఆమెని వెంటాడుతూ, రంగంలోకి పోలీసులు!
Recommended Video

శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రగడ ఎక్కువవుతోంది. కాస్టింగ్ కౌచ్ పై, తాను చేస్తున్న పోరాటంపై పవన్ స్పందన సరిగాలేదని శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పవన్ అభిమానులు శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో అటాక్ మొదలుపెట్టారు. ట్రోలింగ్ చేస్తూ శ్రీరెడ్డి చర్యల్ని తప్పుపడుతున్నారు. దీనితో శ్రీరెడ్డి పోరాటంలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. శ్రీరెడ్డి క్షమాపణ చెప్పాక కూడా పవన్ అభిమానులు శాంతించడంలేదు. మెగాబ్రదర్ నాగబాబు నిన్న ఫిలిం ఛాంబర్ లో ఈ విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని తిట్టడాన్ని తప్పుబట్టారు. దీనివెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసారు. దీనితో శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు రెచ్చిపోతున్నారు. గత రాత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డిని వేటాడిన ఘటన చోటుచేసుకుంది.

పూర్తిగా లభించని మద్దత్తు
గత నెలరోజులుగా టాలీవుడ్ ని కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కుదిపేస్తోంది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం జాతీయ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. కానీ ఆమె చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దత్తు లభించడం లేదు. శ్రీరెడ్డి వైపున కూడా కొన్ని తప్పిదాలు ఉండడం, ఇటీవల ఆమె పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పోరాటం అనేక మలుపులు తిరుగుతోంది.

రెచ్చిపోతున్న పవన్ ఫాన్స్
పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలోకి అనవసరంగా లాగి ఆయన తల్లిని దుర్భాషలాడిందని శ్రీరెడ్డిపై పవన్ ఫాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, పేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డిపై దాడికి దిగుతున్నారు. శ్రీరెడ్డి క్షమాపణ చెప్పినా వారి ఆగ్రహం చల్లారడం లేదు.

నాగబాబు ఎంట్రీ
గత నెలరోజులుగా టీవీల్లో శ్రీరెడ్డి వార్తలు, చర్చలే ఎక్కువగా కనిపిస్తూ సామాన్యులకు విసుగుతెప్పించేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. అటు మీడియాలోను, ఇటు అభిమానుల్లోని ఇది చర్చనీయాంశంగా మారడంతో మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. బుధవారం ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ వివాదంపై సుదీర్ఘంగా మాట్లాడారు.

ప్రజల్లోకి వెళ్లిన పవన్‌ని తిట్టడం ఏంటి
కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, తెలుగు నటులకు అవకాశాలు వంటి అంశాలపై నాగబాబు మాట్లాడారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలోకి లాగి దూషించడాన్ని ఆయన తప్పుబట్టారు.ప్రజల్లోకి వెళ్లి బిజీగా ఉన్న పవన్ ని ఈ విషయంలోకి లాగడం ఏంటని నాగబాబు ప్రశ్నించారు. దీనివెనుక రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. దీనితో పవన్ అభిమానుల్లో శ్రీరెడ్డిపై మరింతగా ఆగ్రహం పెరిగింది.

శ్రీరెడ్డికి వ్యతిరేకంగా
బుధవారం ఓ టివి చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీరెడ్డి వచ్చిందని తెలుసుకున్నా పవన్ ఫాన్స్ అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నజూబ్లీ హిల్స్ పోలీస్ లు అక్కడకు చేరుకున్నారు. శ్రీరెడ్డిని పోలీస్ బందోబస్తుతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వెంటాడిన పవన్ ఫాన్స్
పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ ఆమె వాహనాన్ని పవన్ అభిమానులు వెంటాడారు. దీనితో పోలీస్ లు కొంతమంది అభిమానులని అదుపులోకి తీసుకోవలసి వచ్చింది. శ్రీరెడ్డిని కొంత సమయం పోలీస్ స్టేషన్ లో ఉంచాక ఆ తరువాత ఆమెని తన నివాసానికి చేర్చారు. అదుపులోకి తీసుకున్న పవన్ ఫాన్స్ ని కొంత సమయం తరువాత విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











