సస్పెన్స్‌లో పెట్టి ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్!
కొద్ది సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు రెండు గంటల పాటు పవన్ ఛాంబర్ లో మెగా ఫ్యామిలీ, ఇతర సినీప్రముఖులతో సమావేశం అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్చలు జరిపారు, తన తల్లికి జరిగిన అవమానం గురించి మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోవడం జరిగింది. దీనితో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొని ఉంది.
అర్థ రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తనని అనవసరమైన విషయాల్లోకి లాగడంతో, తన తల్లిపై బూతులు తిట్టించడంతో కొన్ని మీడియా సంస్థల అధినేతలు, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆరోపణలతో ఈ వ్యవహారం హీట్ ఎక్కింది.

రెండు గంటల చర్చలు అనంతరం పవన్ కళ్యాణ్ ఛాంబర్ నుంచి ఎందుకు వెనుదిరిగారు అనే చర్చ జరుగుతుతోంది. మెగా ఫ్యామిలీ, సినీప్రముఖులు అక్కడకు భారీగా తరలి రావడంతో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నట్లు అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ వెనుదిరిగి వెళ్లడంపై స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











