కాస్టింగ్ కౌచ్‌పై పవన్ కళ్యాణ్ ప్రకటన.. 'జనసేన వీరమహిళ' అండదండలతో!

Recommended Video

Pawan Kalyan Gets Supports from Janasena Ladies Team

కాస్టింగ్ కౌచ్ పోరాటం అటు తిరిగి, ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికృత చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో నిలిచే దర్శకుడు వర్మ స్వయంగా పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టమని ప్రేరేపించడంతో అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుని టివి9 యాజమాన్యం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం, నారా లోకేష్ కలసి పన్నిన కుట్రగా సంచలన వ్యాఖ్యలు చేసారు. వారిపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజగా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో మహిళలకు అండగా నిలిచేందుకు సంచలన ప్రకటన చేశారు.

పవన్ కోపమంతా వారిపైనే

పవన్ కోపమంతా వారిపైనే

మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు తన తల్లిని దూషించిన శ్రీరెడ్డి గురించి పవన్ కళ్యాణ్ ఇంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీని వెనుక కుట్ర పన్నిన వారిపైనే పవన్ కోపం, ఆవేదన అంతా.

పవన్ ఫాన్స్ ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమా

పవన్ ఫాన్స్ ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమా

అనవసరమైన విషయాల్లోకి పవన్ కళ్యాణ్ ని లాగి, తద్వారా పవన్ ఫాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం, రాజకీయంగా పవన్ ని దెబ్బతీయడం, ఆయన అభిమానులని విచ్చినం చేసే కుట్ర జరుగుతోందని సినీ రాజకీ వర్గాలు అభిప్రాయం పడుతున్నాయి.

కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్

తాజగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున త్వరలోనే ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పడుతోందని పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. దీనికి జనసేన పార్టీ వీర మహిళా విభాగం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఆ ఛానల్స్ ఎందుకు చూడాలి

మన తల్లులని, ఆడవారిని తిట్టే పత్రిలు, ఛానల్స్ ఎందుకు చూడాలి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఓ మహిళ తన తల్లిని ఇష్టం వచ్చినట్లు టీడీతే టీవీ9, టివీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వంటి ఛానల్స్ పదే పదే ఆ క్లిప్పింగ్స్ చూపిస్తూ డిబేట్లు నడిపాయి. దీనిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X