»   » ‘కాటమరాయుడు’లో పవన్ కళ్యాణ్ బైక్ ఇదే...

‘కాటమరాయుడు’లో పవన్ కళ్యాణ్ బైక్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం 'కాటమరాయుడు' మూవీలో బిజీగా గడుపుతున్నారు. గోపాల గోపాల ఫేం కిశోర్ పార్థసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు ఒక డిఫరెంట్ బైక్ వాడుతుంటారు. కాటమరాయుడు మూవీలో పవన్ కళ్యాణ్ వాడే బుల్లెట్ బైక్ కు సంబంధించిన ఫోటో బయటకు లీకైంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ వాడిన సంగతి తెలిసిందే.


ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో సినిమాను విడుదల చేయాలని మొదట్నుంచీ ప్లాన్ చేసిన టీమ్, ఆ ప్రకారంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేసింది.


పవన్ కళ్యాణ్ బైక్

పవన్ కళ్యాణ్ బైక్

ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి.


రీమేక్ అనే ప్రచారం

రీమేక్ అనే ప్రచారం

ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ అయితే చేయలేదు కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్ట్, పంచతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్లే ఉంది.


క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి

క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి

అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమా(వీరమ్)లో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.


శృతి హాసన్

శృతి హాసన్

కాటమరాయుడులో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగా నటిస్తుంది. కన్నడ నటి మానసహిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.


నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ సెట్లో పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ సెట్లో పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ సెట్లో పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.


బికినీ ఫోటో షూట్: శృతి హాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి? (ఫోటోస్)

బికినీ ఫోటో షూట్: శృతి హాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి? (ఫోటోస్)

బాలీవుడ్లోనే ఆశించిన స్థాయిలో శృతి హాసన్ కెరీర్ సాగడం లేదు. బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా గ్లామర్‌తోనే ముడిపడి ఉంటాయి... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.


English summary
A bike picture from the movie is doing hulchul in social media. This was said to be Pawan Kalyan's bike in Katamarayudu movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu