»   » పూరి పార్టీలో ప్రభాస్ కూడా చిందేసాడా...

పూరి పార్టీలో ప్రభాస్ కూడా చిందేసాడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల తన 49వ పుట్టినరోజు సందర్భంగా సినిమా పరిశ్రమలోని తన సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలో మందు, విందుతో పాటు అతిథులను రంజింప చేసేందుకు ఫారిన్ బ్యూటీలతో బెల్లీ డాన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

పూరి జగన్నాథ్ కు చాలా క్లోజ్ గా ఉండేవారంతా ఈ పార్టీకి హాజరయ్యారు. ప్రభాస్, చార్మి, తేజస్వి మదివాడ, బివిఎస్ రవి, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఆ పార్టీలో పాల్గొని పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. పూరికి చాలా క్లోజ్‌గా ఉండే కొందరు జర్నలిస్టులు కూడా ఈ స్పెషల్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో కొందరు ఈ పార్టీకి సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Prabhas & RGV Dance At Puri Jagannadh Birthday Celebrations

పార్టీకి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బయటకు లీక్ అయ్యాయి. ఆ వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్ లా వ్యాపించాయి. రామ్ గోపాల్ వర్మ పార్టీని ఎంజాయ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ప్రభాస్ డాన్స్ చేస్తున్న వీడియో కూడా లీకైంది. అయితే ఆ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన కొంత సేపటికే దాన్ని తొలగించారు. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో తొలగించినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన వీడియో బయటకు లీక్ అవ్వడం వివాదాస్పదం అయింది. పూరి తన బర్త్ డే పార్టీని పర్సనల్ గా జరుపుకున్నారు. అయితే లీకైన వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు.

English summary
It is known that Puri Jagannadh has arranged a lavish birthday party on the eve of his 49th birthday to his close friends from the industry. Prabhas, Charmi, Tejaswi Madivada, BVS Ravi, Ram Gopal Varma were some of the guests at the fun filled birthday event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu