Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Vakeel Saabపై కామెంట్.. మధ్యలో పూరి జగన్నాథ్‌ను లాగిన ప్రకాశ్ రాజ్
రాజకీయంగా బేధాభిప్రాయాలున్నా కూడా సినిమా విషయాలకు వచ్చే సరికి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ అంతా ఒక్కటే. ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తు చేశాడు. వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర గురించి చెబుతూ.. తమ పాత్రల మధ్య ఎంత పోటాపోటీగా ఉంటుందో చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇప్పుడు అంతా కూడా వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ మ్యానియానే కనిపిస్తోంది. ఇందులో ప్రకాశ్ రాజ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
గొప్ప నటుడు..
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు.. రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా, ఆయన నా గురించి మాట్లాడినా కూడా సినిమా వరకు వచ్చే సరికి అంతా ఒక్కటే. ఆయన అభిప్రాయం అది. నేను గౌరవిస్తాను. ఆయన నాకు ఇష్టమైన వ్యక్తి.. గొప్ప నటుడు అంటూ ప్రశంసలు కురిపించాడు.
పోటాపోటీగా..
బలమైన ప్రతినాయకుడు ఉంటే మనకు కూడా నటించాలనే కోరిక ఉంటుంది. అవతల ప్రకాష్ రాజ్ ఉండటంతో కోర్ట్ సీన్స్ బాగా వచ్చాయి. వారి వల్ల నేను కూడా బాగా చేయగలిగాను అంటూ ప్రకాష్ రాజ్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
వన్ మెన్ షో..
వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ అందరూ కూడా తీర్పునిచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్ పాత్రకు ప్రాముఖ్యం ఉందంటూ చెప్పుకొస్తున్నారు.
ప్రకాశ్ రాజ్ రియాక్షన్..
వకీల్ సాబ్ ఫెస్టివల్ బిగిన్ అంటూ యాష్ ట్యాగ్‌తో ప్రకాశ్ రాజ్ రచ్చ చేశాడు. అయితే ఈ చిత్రంలో నంద అనే న్యాయవాది పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన సంగతి తెలిసిందే. బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఐకానిక్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి గురించి ప్రస్థావిస్తూ ప్రకాశ్ రాజ్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Recommended Video
ఆ మ్యాజిక్..
పూరి జగన్నాథ్ బద్రి సినిమాతో నందను సృష్టించినందుకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు. ఆ కాంబో మళ్లీ ఇప్పుడు దుమ్ములేపుతోందంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ చేశాడు. మొత్తానికి కోర్ట్ సీన్ మాత్రం వకీల్ సాబ్ సినిమాకు హైలెట్ అయింది.