పవన్ కళ్యాణ్ కోసం బన్నీ వాసు.. మెగా ఫాన్స్ మీటింగ్, మేమేంటో చూపిస్తాం, పీఆర్పీని కూడా ఇలాగే!

టాలీవుడ్ లో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పూటకో ట్విస్ట్, రోజుకో అనూహ్య పరిణామంగా సాగుతోంది. శ్రీరెడ్డి పోరాటం ఆరంభించిన మొదట్లో ఆమెకు లభించిన మద్దత్తు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన నీచమైన కామెంట్ల తరువాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీరెడ్డిపై క్రమంగా వ్యతిరేకత మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డిపై ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇటువంటి సమయంలో శ్రీరెడ్డి, ఆమె ట్రాన్స్ జెండర్ స్నేహితురాలు తమన్నా మధ్య సాగిన ఫోన్ సంభాషణ లీకై పనే సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంలోకి రాంగోపాల్ వర్మ కూడా చేరడంతో తీవ్రత పెరిగింది. ఈ మొత్తం హై డ్రామాని గమనిస్తున్న మెగా ఫాన్స్ రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు నా పేరు సూర్య చిత్ర నిర్మాత బన్నీ వాసు సంచలన ప్రకటన చేశారు.

మొదట్లో సానుభూతి

మొదట్లో సానుభూతి

శ్రీరెడ్డి మొదట కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం ప్రారంభించిన సమయంలో ఆమె వ్యతిగత జీవితం ఎలా ఉన్నా.. ఓ సమస్య కోసం గళం విప్పుతోందని అంతా భావించారు. ఆమెపై సానుభూతి పెరిగింది. కానీ జరుగుతున్న పరిణామాలు, శ్రీరెడ్డి ప్రవర్తన గమనిస్తున్న వారిలో శ్రీరెడ్డి పట్ల వ్యతిరేకత మొదలవుతోంది.

 మహిళా సంఘాల మద్దత్తు

మహిళా సంఘాల మద్దత్తు

శ్రీరెడ్డి ఒంటరిగా పోరాటం మొదలు పెట్టడం, టాలీవుడ్ బడా ప్రముఖుల పేర్లు బయట పెట్టడంతో మీడియా దృష్టి ఎక్కువగా పడింది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు శ్రీరెడ్డికి మద్దత్తు తెలపడానికి ముందుకు వచ్చాయి.

మొత్తం మారిపోయింది

మొత్తం మారిపోయింది

శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆ తరువాత కూడా ఆఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై వ్యాఖ్యలని ఖండించారు. ఇంతలో ఈ వ్యవహారంలో తాను కూడా ఉన్నానంటూ రాంగోపాల్ వర్మ బయటకు రావడంతో హై డ్రామా మొదలైంది.

 తిట్టమని వర్మే చెప్పాడట

తిట్టమని వర్మే చెప్పాడట

ప్రముఖ నిర్మాత నుంచి 5 కోట్లు శ్రీరెడ్డికి ఇప్పించి వివాదాన్ని ముగిద్దామని ప్రయత్నించానని వర్మ తెలిపాడు.కానీ శ్రీరెడ్డి అందుకు ఒప్పుకోలేదని అన్నాడు. పవన్ కళ్యాణ్ ని అలా తిట్టామని చెప్పింది కూడా తానే అని వర్మ తెలపడంతో సంచలనంగా మారింది. తాజగా శ్రీరెడ్డి, ఆమె స్నేహితురాలు, జూనియర్ ఆర్టిస్టుఅయినా తమన్నాతో మాట్లాడిన ఫోన్ కాల్ లీకైంది. ఫోన్ సంభాషణలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మల్లి వివాదం రేపే విధంగా ఉన్నాయి.

నేనే ఆగలేకపోతున్నా

నేనే ఆగలేకపోతున్నా

ఈ వివాదంలో రాంగోపాల్ వర్మ ప్రమేయం ఉందని తెలుసుకున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులని కూల్ గా ఉండమని తాను ఎప్పుడూ చెబుతుంటానని కానీ, ఈ హైడ్రామా గమనించిన తరువాత తానే ఆగలేకపోతున్నానని బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు.

 రంగంలోకి మెగా ఫాన్స్

రంగంలోకి మెగా ఫాన్స్

ఈ కుట్రలని గమనించిన తరువాత బన్నీ వాసు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మెగా ఫాన్స్ తో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. యుద్దానికి సిద్ధం అవ్వండి అంటూ పిలుపు ఇచ్చారు. ఈ సాయంత్రానికి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.ఇలాంటి కుట్రలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో జరిగాయని బన్నీ వాసు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X