ఆపుకోలేక : న్యూడ్ ఫొటో షేర్ చేసిన పూరీ జగన్నాథ్ (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : తనను తాను ఎక్సప్రెస్ చేసుకోవటంలో ఎప్పుడు సిగ్గుపడటానికి ఇష్టపడని దర్శకుడు పూరి జగన్నాధ్. ఆయన తాజాగా ఓ మోడల్ న్యూడ్ ఫొటో ట్విట్టర్ లో షేర్ చేసి అందరినీ షాక్ చేసారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడండి.

ఇక పూరీ తాజా చిత్రం లోఫర్ విషయానికి వస్తే....

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ ని కొత్తగా చేయాలని పూరి జగన్నాథ్ భావించారు. ఈ మేరకు ఆయన లొకేషన్ నుంచి షూటింగ్ లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్ ని చూడటం కోసం ఆయన తన Periscope ఛానెల్ లింక్ ని సైతం ట్వీట్ చేసారు.

puri jagan can't resist sharing nude pic

ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

నోరా పతేహి ఇప్పటికే టెంపర్, బాహుబలి, కిక్ 2 చిత్రాల్లో ఐటం సాంగ్స్ తో అదరగొట్టింది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ ఆమె సాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందని, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇందుకు సంబంధించిన సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్‌గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X