»   » మహేష్ బాబు స్పందించడం లేదు, టైం వేస్ట్ చేస్తే ఎలా? : పూరి జగన్నాథ్

మహేష్ బాబు స్పందించడం లేదు, టైం వేస్ట్ చేస్తే ఎలా? : పూరి జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' అప్పట్లో ఇండస్ట్రీ హిట్. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో బిజినెస్‌మేన్ సినిమా కూడా వచ్చింది. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

'పోకిరి' సినిమా విడుదలైన 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూరి జగన్నాథ్... తన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేసారు. మహేష్ బాబుతో 'జన గణ మన' సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ సినిమా ప్రకటన దగ్గరే ఆగిందే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.

ఈ విషయమై ఇటీవల ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి పూరి జగన్నాధ్ తనదైన రీతిలో స్పందించారు.

మహేష్ బాబుకు స్టోరీ చెప్పాను

మహేష్ బాబుకు స్టోరీ చెప్పాను

నేను మహేష్ బాబుకు ‘జన గణ మన' స్టోరీ చెప్పాను. నేను చెప్పిన స్టోరీ ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత నేను దాని గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసాను అని పూరి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మహేష్ ఉలుకు పలుకు లేదు

మహేష్ ఉలుకు పలుకు లేదు

మహేష్ బాబుకు ఆ స్టోరీ నచ్చింది. అయితే డేట్స్ ఇవ్వమని అడిగితే ఆయన స్పందించడం లేదు. ఆయన అలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నన్నేం చేయమంటారు. అందుకే నేను వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాను అని పూరి తెలిపారు.

టైమ్ వేస్ట్ చేయొద్దు

టైమ్ వేస్ట్ చేయొద్దు

సినిమా చేస్తారా? లేదా? అనేది ఏదో ఒకటి తేల్చి చెబితే ఎదుటి వారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే ఇతరుల టైం వేస్ట్ చేసినట్లే అని పూరి స్పందించినట్లు తెలుస్తోంది.

పూరి బ్యాంకాక్ సీక్రెట్స్: థాయ్ గర్ల్స్‌తో సెక్స్, మసాజ్ గురించి...

పూరి బ్యాంకాక్ సీక్రెట్స్: థాయ్ గర్ల్స్‌తో సెక్స్, మసాజ్ గురించి...

పూరి జగన్నాథ్ ఇటీవల తన బ్యాంకాక్ సీక్రెట్స్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూరి నెక్ట్స్ మూవీ ఇజం

పూరి నెక్ట్స్ మూవీ ఇజం

నా బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా: అన్నపై ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"I told Mahesh 'Jana Gana Mana' story. He liked it. But since then, he hasn't responded. There is no reaction from him. What can I do?" Puri Jagannadh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu