పూరి జగన్నాథ్ సంచలన నిర్ణయం.. ఛార్మీతో కలిసి.. రియల్ డాషింగ్ డైరెక్టర్!
డాషింగ్ డైరెక్టర్ సంచలన నిర్ణయం తీసుకొని గొప్ప మనసు చాటుకున్నారు. కష్టం విలువ తెలిసుకొని గొప్ప ఆలోచన చేశారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారంతా సంతోషంగా ఉంటూ వారి వారి లక్ష్యాలు చేరుకునే దిశగా అడుగులేయాలని తాపత్రయ పడుతూ, అలాంటి వారికి తనవంతు సహాయం చేస్తానని ముందుకొచ్చారు పూరి జగన్నాథ్. ఇందులో ఛార్మి కూడా భాగం కావడం విశేషం. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన జారీ చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

అన్నీ తానై పూరితో ఛార్మి
గతంలో వెండితెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి.. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి వరుస సినిమాలు నిర్మిస్తోంది. ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను నిర్మిస్తూ.. ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన పనుల్లో అన్నీ తానై భాగమవుతోంది.

వరుస ఫ్లాప్‌లతో సతమతమై చివరకు
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన పూరి జగన్నాథ్.. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమయ్యారు. చివరకు ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిం భారీ విజయం సాధించారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

విజయానందంలో సంచలన నిర్ణయం
ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న పూరి జగన్నాథ్ తన పుట్టిన రోజు కానుకగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒకటో, రెండో సినిమాలు తీసి వివిధ కారణాల వల్ల సినిమాలు చేయలేక పోతున్న దర్శకులు, అసిస్టెంట్ దర్శకులకు ఆర్థికంగా తోడ్బాటు అందిస్తానని పేర్కొన్నారు. ఛార్మితో కలిసి సంయుక్తంగా 20 దర్శకులకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు.

పూరి కనెక్ట్స్ లెటర్ పాడ్ పై నోట్ రాసి..
ఈ మేరకు పూరి కనెక్ట్స్ లెటర్ పాడ్ పై ఓ నోట్ రాసి విడుదల చేశారు. ఎందరో సృజనాత్మకత ఉన్న దర్శకులు సినిమాలు తీయాలని కళలు కంటారు. కానీ పరిస్థుతుల ప్రభావం, ఆర్ధిక స్థోమత లేక ముందడుగేయలేక పోతారు. అలాటి వారి కోసం దేవుణ్ణి ప్రార్ధించడం కన్నా, కొందరికి కొంతలో కొంతయినా ఆర్థిక సహాయం చేయాలనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి ప్రతీ ఏడాది ఇదే కంటిన్యూ చేస్తాం అని పేర్కొన్నారు.

పూరి, ఛార్మి సినిమాలు
పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రూపంలో వారికి భారీ విజయం దక్కింది. ఈ సంతోషాన్ని ఇలా పంచుకోవడం పట్ల ప్రేక్షకులు వారిద్దరిపై అభినందనల వర్షం గుప్పిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











