మరోసారి ఆ హీరోతో వర్క్ చేయబోతున్న పూరి జగన్నాథ్.. హిట్ సినిమాకు సీక్వెల్?
టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా సుదీర్ఘ కాలం పాటు తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుని కొనసాగుతున్న వ్యక్తి పూరి జగన్నాథ్. టాలీవుడ్ కి హీరోయిజం అంటే ఇలా కూడా ఉంటుంది అని పరిచయం చేసిన అగ్ర దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా సుమారుగా అతనితో కలిసి సినిమాలు చేసిన వారే. తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం పూరి జగన్నాథ్ స్టైల్.
పూరి సినిమాలలో హీరో క్యారెక్టర్, డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అతను సినిమాలోని డైలాగ్స్ చాలావరకు యూత్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ కెరియర్ ఏమి బాగోలేదు అని చెప్పాలి. బాలకృష్ణతో చేసిన పైసా వసూల్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

గత ఏడాది విజయ్ దేవరకొండ చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ అయితే డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన లైగర్ ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీనితో పూరి జగన్నాథ్ పని అయిపోయింది అని అందరూ డిసైడ్ చేసేసారు. ఫ్లాప్ వచ్చిన కూడా మరల తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే సత్తా ఉన్న దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి గుర్తింపు ఉంది.ఈ నేపథ్యంలో మరల పర్ఫెక్ట్ స్టోరీతో తనని తాను ఎలివేట్ చేసుకోవాలని పూరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా రామ్ పోతినేనితో ఉండొచ్చు అనే మాట ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. గతంలో మీరిద్దరి కాంబినేషన్ ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడే దానికి సీక్వెల్ కూడా చేస్తానని పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు రామ్ తో ఈ సీక్వెల్ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా కూడా స్టార్ట్ చేశారు. అయితే లైగర్ ఫ్లాప్ కారణంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు దానిని రామ్ పోతినేనితో చేసే అవకాశం ఉందనే మాట మరో వర్గం నుంచి వినిపిస్తోంది. మరి ఈ రెండు ప్రాజెక్టులలో దేనిని స్టార్ట్ చేస్తారు అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











