పూరి, ఛార్మి ఒకరికొకరు.. ఇస్మార్ట్‌గా ఖరీదైన కార్లతో! ఇదీ అసలు విషయం

Recommended Video

Puri Jagannadh & Charmy Kaur Bought Range Rover Vogue And BMW 7 Series Car

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, అందాల భామ ఛార్మి ఎంత క్లోజ్ అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఛార్మి.. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ సినిమాలకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలు చూసుకుంటూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరూ కలిసి సినిమా నిర్మాణాల్లో భాగమవుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరూ సరికొత్తగా ఒకరికొకరు ఖరీదైన కార్లు బహుకరించుకోవడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

పూరి కెనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు

పూరి కెనెక్ట్స్ బ్యానర్‌పై సినిమాలు

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కెనెక్ట్స్ బ్యానర్లపై పలు సినిమాలు రూపొందిస్తున్నారు పూరి, ఛార్మి. ఈ బ్యానర్లకు సంబంధించిన అన్ని పనుల్లో ఛార్మి ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇక ఇటీవలే ఇదే బ్యానర్స్‌పై ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందించి భారీ సక్సెస్ సాధించారు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్.

సక్సెస్‌తో పాటు ఫైనాన్సియల్‌గా

సక్సెస్‌తో పాటు ఫైనాన్సియల్‌గా

గత కొంత కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న పూరి జగన్నాథ్‌కి మంచి బ్రేక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్ మూవీ. ఈ సినిమా అందించిన విజయం ఫైనాన్సియల్‌గాను అతన్ని ఓ మెట్టు ఎక్కించింది. ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి లాభాల పంట పండించింది.

 ఖరీదైన కార్లు ఇచ్చిపుచ్చుకున్న పూరి, ఛార్మి

ఖరీదైన కార్లు ఇచ్చిపుచ్చుకున్న పూరి, ఛార్మి

ఈ సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ నిర్మాతలు పూరీజగన్నాథ్, ఛార్మి సినిమా విజయాన్ని బహుమతుల రూపంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘పూరీ కనెక్ట్స్' నిర్మాణ సంస్థ ఫౌండర్స్ అయిన పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఛార్మికి పూరి జగన్నాథ్ బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగా.. పూరీ జగన్నాథ్‌కు ఛార్మి రేంజ్ రోవర్ వోగ్‌ను బహుమతిగా ఇచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ పిక్స్

సోషల్ మీడియాలో వైరల్ పిక్స్

ఈ ఇద్దరూ ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకొని ఆ ఖరీదైన కార్లతో ఫొటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి ఇస్మార్ట్‌గా ఆలోచించిన ఇస్మార్ట్ శంకర్ నిర్మాతలు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇస్మార్ట్ శంకర్ మూవీ

ఇస్మార్ట్ శంకర్ మూవీ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది 'ఇస్మార్ట్ శంకర్' మూవీ. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విజయం చిత్రయూనిట్ మొత్తానికి మంచి జోష్ ఇవ్వడమే గాక కొత్త అవకాశాలు తెచ్చిపెడుతోంది.

విజయ్ దేవరకొండతో పూరి

విజయ్ దేవరకొండతో పూరి

ఇస్మార్ట్ శంకర్ జోష్‌లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమా పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X