ఆ సినిమా నుంచి తీసుకున్నా.. కాపీ మాత్రం కాదు: పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్ - రామ్ కాంబినేషన్ వస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డబుల్ సిమ్ కార్డ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు పూరీ జగన్నాథ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. దీనికితోడు, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో చిత్ర యూనిట్ కూడా హ్యాపీగా ఉందని ప్రచారం జరుగుతోంది.

పూరీ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో రామ్ సరికొత్త లుక్, డైలాగ్ డెలివరీని ప్రయత్నించాడు. అయితే, 'ఇస్మార్ట్ శంకర్' బ్రిటన్‌కు చెందిన 'ఐబాయ్'కు కాపీ అన్న టాక్ వినిపిస్తోంది. కెవిన్ బ్రూక్స్‌ నవల ఆధారంగా ఆడమ్ రాండెల్ తెరకెక్కించిన ఈ సినిమాలోనూ మెదడులో సెల్‌ఫోన్ ఉండడంతో సూపర్ హ్యూమన్‌లా మారతాడు. ఇప్పుడిదే కథ 'ఇస్మార్ట్'లో ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

Puri Jagannadh Clarity About iSmart Shankar copy News

దీంతో ఈ వార్త ఫిలింనగర్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో పాల్గన్న పూరీ సినిమా కాపీ అని వస్తున్న వార్తలపై స్పందించాడు. తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. ''ఇస్మార్ట్ శంకర్' ఓ హాలీవుడ్‌ సినిమాకు కాపీ అని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ సినిమాను కొన్ని హాలీవుడ్ చిత్రాల నుంచి స్పూర్తి పొంది తెరకెక్కించాను. అంతేకానీ, ఏ సినిమానూ కాపీ కొట్టలేదు. ఈ విషయం మీకు తెలియాలంటే నా సినిమా విడుదల అయ్యాక చూడండి. అలాగే ఏ సినిమా నుంచైతే కాపీ అంటున్నారో ఆ సినిమానూ చూడండి'' అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X