చిరంజీవి, రామ్ చరణ్‌పై పూరి జగన్నాథ్ కామెంట్స్.. ఎంతైనా డాషింగ్ డైరెక్టర్ కదా! అందుకే ఇలా..

Recommended Video

Puri Jagannadh Comments On Sye Raa Movie || చిరంజీవిని కొట్టేటోడు మళ్ళీ పుట్టడు : పూరి జగన్నాథ్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు 'సైరా నరసింహా రెడ్డి' సినిమాపైనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ఫ్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ప్రేక్షకులతో సహా సినీ ప్రముఖులు సైతం కుతూహలంగా ఉన్నారు. సరిగ్గా ఈ తరుణంలో సైరా నరసింహా రెడ్డి సినిమాపై పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. ఇంతకీ పూరి ఏమన్నాడు? ఆ వివరాలు చూస్తే..

300 కోట్ల భారీ బడ్జెట్‌తో సైరా..

300 కోట్ల భారీ బడ్జెట్‌తో సైరా..

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు మేకర్స్.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. దర్శకుల ప్రశంసలు

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. దర్శకుల ప్రశంసలు

'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన దర్శకులు రాజమౌళి, వీవీ వినాయక్, కొరటాల శివ.. చిరంజీవిపై, సైరా నరసింహా రెడ్డి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

సోషల్ మీడియాలో పూరి కామెంట్స్

తాజాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వీడియో పోస్ట్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ వీడియోలో స్వయంగా ఆయనే మాట్లాడుతూ చిరంజీవి, రామ్ చరణ్ లను ఆకాశానికెత్తేశారు. దీంతో పూరి కామెంట్స్‌పై మెగా ఖుషీ ఖుషీ అవుతున్నారు.

కొన్నేళ్ల ఏళ్ల క్రితం రామ్ చ‌ర‌ణ్ చెప్పాడు

కొన్నేళ్ల ఏళ్ల క్రితం రామ్ చ‌ర‌ణ్ చెప్పాడు

డాడీతో ఓ మొమ‌ర‌బుల్ మూవీ తీయాలని కొన్నేళ్ల క్రితమే రామ్ చ‌ర‌ణ్ తనతో చెప్పాడని, అది మనమంతా ఫ్రౌడ్‌గా ఫీల‌య్యే సినిమా కావాలని చెర్రీ ఆశించినట్లుగా పూరి చెప్పుకొచ్చారు. అయితే మొన్న రిలీజ్ అయిన సైరా టీజ‌ర్ చూడ‌గానే తనకు చ‌రణే గుర్తుకొచ్చాడని, నిజంగా త‌నకు చెప్పిన సినిమానే రామ్ చరణ్ తీశాడని ఆయన పేర్కొన్నాడు.

అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు

అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు

సైరాకు వెండితెర రూపమివ్వడంలో భాగంగా గ్రాండియర్‌గా కానీ.. విజువ‌ల్స్‌గా కానీ సురేంద‌ర్ రెడ్డి ఇరగదీశాడని పూరి అన్నారు. ఇక అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డని పేర్కొంటూ 'ల‌వ్ యు అన్న‌య్య‌' అనేశారు. ఓ మెగాస్టార్ అభిమానిగా సైరా పెద్ద హిట్ అవ్వాల‌ని తాను మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా పూరి జగన్నాథ్ తెలిపారు.

పూరి జగన్నాథ్ జోష్..

పూరి జగన్నాథ్ జోష్..

ఆ మధ్యకాలంలో కాస్త డీలా పడిన పూరి జగన్నాథ్.. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌లో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు పూరి జగన్నాథ్. అతిత్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X