బాలకృష్ణ క్యారెక్టర్‌‌ను బయటపెట్టిన పూరీ జగన్నాథ్.. ఫ్యాన్స్ కోపంగా...

Recommended Video

Puri Jagannadh Interesting Comments On Nandamuri Balakrishna Charecter || Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో 'పైసా వసూల్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో దర్శనమిచ్చాడు. పంచ్ డైలాగులు చెబుతూ.. తేడా తేడాగా ప్రవర్తించాడు. అంతేకాదు, ఇందులో 'మామా ఏక్ పెగ్గు లా' అంటూ పాటను కూడా పాడాడు. అయినా.. ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా ఫలితంతో చిత్ర యూనిట్‌తో పాటు బాలయ్య అభిమానులు సైతం నిరాశ చెందారు.

మళ్లీ సినిమా చేస్తా

మళ్లీ సినిమా చేస్తా

పూరీ జగన్నాథ్ తాజాగా తెరకెక్కించిన చిత్ర ‘ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని చానెళ్లకు ఆయన ఇంటర్య్వూలు ఇచ్చారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే విషయంపై మాట్లాడారు. త్వరలోనే బాలయ్యతో మరోసారి సినిమా చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దీంతో బాలయ్య ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.

బాలయ్య ఉన్నాడు

బాలయ్య ఉన్నాడు

ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. హిట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా మీరు అడిగిన వెంటనే సినిమా చేయడానికి సిద్ధమయ్యేందుకు ఎవరైనా హీరో ఉన్నారా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ‘‘బాలయ్య ఉన్నాడు'' అంటూ ఒక్క మాటలో సమాధానం చెప్పాడు పూరీ.

బాలయ్య క్యారెక్టర్‌పై కామెంట్స్

బాలయ్య క్యారెక్టర్‌పై కామెంట్స్

మరో ఇంటర్వ్యూలో బాలయ్య గురించి చెప్పమని యాంకర్ అడగగానే పూరీ సమాధానం ఇచ్చాడు. ‘‘బాలయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయనకు క్యారెక్టర్ ఉంది. మనుషులకు విలువ ఇస్తాడు. మాట మీద నిలబడతాడు'' అంటూ చెప్పుకొచ్చాడు ఈ డాషింగ్ డైరెక్టర్.

ఫ్యాన్స్ కోపంగా ఉన్నారనిపించింది

ఫ్యాన్స్ కోపంగా ఉన్నారనిపించింది

‘‘బాలయ్యకు మంచి హిట్ సినిమా ఇవ్వలేకపోయాననే బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. అలాగే, ఆయన కూడా ఈ సినిమా ఫలితంపై అంత హ్యాపీగా లేరు. అంతేకాదు, బాలయ్య అభిమానులు కూడా నాపై కోపంగానే ఉండి ఉంటారు. కాబట్టి త్వరలోనే మరో సినిమా చేసి ‘పైసా వసూల్' ఫలితం నుంచి బయట పడేయాలనుంది'' అని చెప్పుకొచ్చాడు.

సంతృప్తి పరిచిన ‘ఇస్మార్ట్ శంకర్'

సంతృప్తి పరిచిన ‘ఇస్మార్ట్ శంకర్'

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్‌ను ‘ఇస్మార్ట్ శంకర్' ఫలితం సంతృప్తి పరిచిందనే చెప్పాలి. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే రామ్ కెరీర్‌లో భారీ కలెక్షన్లు సాధించే దిశగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X