ఉచ్చ పడిపోయింది.. వెంటనే ప్రభాస్, చరణ్, చిరు ఫోన్ చేశారు.. హీరోలపై పూరీ షాకింగ్ కామెంట్స్

Recommended Video

ISmart Shankar Movie Success Meet || Filmibeat Telugu

పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు వరుస సినిమాలు తీస్తూ బిజీ బిజీగా గడిపిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఇప్పుడు కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. కాకపోతే మూడేళ్లు హిట్ అనే మాటను వినలేదాయన. అయితే, తాజాగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు పూరీ జగన్నాథ్. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నభానటేశ్‌, నిధి అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా ఆయన దర్శకత్వం వహించిన 'ఇస్మార్ఠ్‌ శంకర్‌' సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ఆడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పూరీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఉచ్చపడిపోయింది

ఉచ్చపడిపోయింది

సినిమా ఫలితం విషయంలో చాలా కంగారు పడ్డానన్న పూరీ.. ‘‘అందరికీ నమస్కారం. నేను సినిమా తీస్తే మ్యాజిక్ అంటున్నారు ఒకరు. ‘ఇస్మార్ట్ శ్రీను' మాత్రం సునామీ అంటున్నాడు. ఈ అమ్మాయేమో హిట్ నాకోసం వెయిట్ చేస్తుందని అంటుంది. మీకు తెలియదు.. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అని నాకు ఉచ్చ పడిపోయింది. నాకన్నీ తెలిస్తే అన్నీ హిట్ సినిమాలే తీసేవాడిని కదా'' అంటూ చెప్పుకొచ్చాడు.

లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కోరుకున్నా

లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కోరుకున్నా

అలాగే, తన గత చిత్రాల గురించి స్పందిస్తూ.. ‘‘నాకు సరైన హిట్ వచ్చి మూడేళ్లైపోయింది. కాబట్టి ఈ సినిమా ఫలితం గురించి చాలా కంగారు పడిపోయారు. అందుకే ఇది ఎలాగైనా ఆడాలని, హిట్ కొట్టాలని అనుకున్నాను. అంతేకాదు, లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నాకు హిట్ కావాలి అని గట్టిగా కోరుకున్నాను ఫైనల్‌గా హిట్ వచ్చింది'' అని ఆయన వెల్లడించాడు.

ఏపీలో సాలిడ్ రెస్పాన్స్

ఏపీలో సాలిడ్ రెస్పాన్స్

ఇటీవల చిత్ర యూనిట్ ఏపీలో పర్యటించింది. ఈ సందర్భంగా తమ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. ‘‘ఇస్మార్ట్ శంకర్' బ్లాక్‌బస్టర్ అయింది. మొన్న టూర్ వెళ్లాం. కర్నూల్‌లో మొదలుపెట్టి అనంతపురం, విజయవాడ, భీమవరం ఇలా అన్ని ఊర్లు తిరిగేశాం. ఎక్కడికెళ్లినా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది'' అని పూరీ జగన్నాథ్ తెలిపాడు.

ఆంధ్రా వాళ్లు ముదుర్లు

ఆంధ్రా వాళ్లు ముదుర్లు

ఏపీలో టూర్ చేస్తున్న సమయంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తూ.. ‘‘రామ్ పిల్లల రక్తంలోకి వెళ్లిపోయాడు. వాళ్లు చేసే వీడియోలు గానీ, డైలాగులు గానీ బాగున్నాయి. సినిమాలోని తెలంగాణ యాస.. ఆంధ్రాలో అర్థం కాదని అన్నారు. కానీ, మొన్న ఏపీలో ఒక కాలేజ్‌కు వెళ్లి ఎలా ఉంది సినిమా అంటే కిర్రాక్ ఉంది అన్నా సినిమా అంటున్నారు. మస్త్ తిసినవ్ అన్నా సినిమా అంటున్నారు. వాళ్లంతా తెలంగాణ మాట్లాడేస్తున్నారు. నేనొప్పుడో చెప్పా ఆంధ్రా వాళ్లు ముదుర్లు అని. వాళ్లు ఇట్టే పట్టేస్తారు'' అని వివరించాడు.

హీరోలపై కామెంట్స్

హీరోలపై కామెంట్స్

ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇస్మార్ట్ శంకర్' రిలీజ్ అవగానే ప్రభాస్ కాల్ చేశాడు. ‘డార్లింగ్.. నేను సినిమా చూడలేదు. బాగా ఆడుతుందంట. హ్యాపీగా ఉంది నాకు' అన్నాడు. నాగ చైతన్య, అఖిల్, సుమంత్, విదేశాల్లో ఉన్న రానా, చరణ్‌లు ఫోన్ చేశారు. చిరంజీవి గారు సినిమా చూశారు. బాలయ్య ఇప్పుడు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత మంది హీరోలు ఎప్పుడూ ఫోన్ చేయలేదు. ఇన్ని రోజులు మంచి సినిమా తీయలేదని వాళ్లకు అనిపించింది. ఇప్పుడు నేను కమ్‌బ్యాక్ అయ్యాను. ఇలాంటి సినిమాలు వస్తాయి. సీటీ సినిమాలే తీయాలని డిసైడ్ అయ్యా'' అని ఆయన పేర్కొన్నాడు.

భారీ కలెక్షన్లు

భారీ కలెక్షన్లు

‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైన రోజు నుంచి కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమాకు మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సీనియర్ హీరోయిన ఛార్మీ తెలిపింది. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X