హీరోయిన్‌లా మారిన పూరి జగన్నాథ్ కూతురు.. పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్!

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా రెగ్యులర్ గా తన ఫ్యామిలీతో సమయాన్ని గడపకుండా ఉండలేడు. కొడుకు కూతురు అంటే ఈ స్టార్ డైరెక్టర్ కి ఎంతో ఇష్టం. కొడుకు ఆకాష్ పూరి ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా కూతురు పవిత్ర మాత్రం నటనకు దూరంగా ఉంటూ తండ్రి డైరెక్షన్ టీమ్ లో అప్పుడప్పుడు బిజీగా వర్క్ నేర్చుకుంటోంది.

పవిత్ర ఫొటోస్ వైరల్

పవిత్ర ఫొటోస్ వైరల్

పూరి జగన్నాథ్ కూతురు పవిత్రి చిన్నప్పుడు బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత మళ్ళీ సినిమాల వైపు చూడలేదు. పూర్తిగా చదువుపైనే శ్రద్ద పెట్టిన పవిత్ర.. పూరి జగన్నాథ్ కి కొడుకు కంటే ఎక్కువే. చాలా ఇంటర్వ్యూలలో తన కూతురికి తన కంటే తెలివి ఎక్కువ అని వివరణ కూడా ఇచ్చాడు.

 డీసెంట్ హీరోయిన్

డీసెంట్ హీరోయిన్

ప్రస్తుతం పవిత్ర ఫోటోలను చూస్తుంటే ఒక డీసెంట్ హీరోయిన్ పాత్రలకు ఉపయోగపడుతుందేమో అనేలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తన తండ్రి అంటే పవిత్రకు ఎంత ఇష్టమో ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ ని చూస్తే అర్ధమవుతుంది.

హీరోయిన్ గా కాదు గాని..

హీరోయిన్ గా కాదు గాని..

ఇక పవిత్ర హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాలక్రిష్ణ పైసా వసూల్ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర ద్వారా మళ్ళీ యాక్టింగ్ తో బిజీ కానున్నట్లు టాక్ వచ్చింది. కానీ అలా జరుగలేదు. పూరి జగన్నాథ్ కూడా ఆమె కెరీర్ గురించి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆమె హీరోయిన్ కాదు గాని ప్రొడక్షన్ వర్క్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని భవిష్యత్తులో పూరి కనెక్ట్స్ లో సినిమా నిర్మిస్తుందనే నమ్మకం తనకు ఉందని పూరి వివరణ ఇచ్చాడు.

Recommended Video

Mahesh Babu Comments On Movie With Puri Jagannath
డైరెక్షన్ కూడా చేస్తుందేమో..

డైరెక్షన్ కూడా చేస్తుందేమో..

అప్పుడప్పుడు పవిత్ర తన తండ్రి సినిమాల కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా కూడా వర్క్ చేస్తోంది. కుదిరితే భవిష్యత్తులో డైరెక్షన్ కూడా చేస్తుందేమో అనే టాక్ వస్తోంది. మరి పవిత్ర ఎలాంటి కెరీర్ ని ఎంచుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మరోవైపు ఆమె సోదరుడు ఆకాష్ పూరి నెక్స్ట్ రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X