షార్ట్ ఫిల్మ్ తీస్తున్న ‘పూరి’.... ఫస్ట్ లుక్ చూస్తే షాకవుతారు!
రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసి దర్శకుడిగా మారిన పూరి జగన్నాథ్.... ఆయన ఆలోచన విధానాన్ని చాలా వరకు ఫాలో అవుతుంటారు. పూరి సినిమాల్లో అందుకు సంబంధించిన ఛాయలు మనకు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. వర్మ మాదిరిగానే ఇపుడు పూరి కూడా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల వైపు టర్న్ అయ్యారు.

పూరి తొలి షార్ట్ ఫిల్మ్ ఇదే
‘హగ్' పేరుతో పూరి ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు. దీన్ని డిసెంబర్ 31వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఇక ముందు చాలా ఉంటాయా?
పూరి తన ట్విట్టర్లో ఇది తన తొలి షార్ట్ ఫిల్మ్ అని వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మున్ముందు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా తీస్తానని చెప్పకనే చెప్పారు.

అందరూ షాకయ్యేలా నగ్నంగా
పూరి తీస్తున్న ‘హగ్' షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ చూసిన వారంతా షాకవుతున్నారు. ఇందులో ఓ అమ్మాయి ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అడవిలో చెట్టును హగ్ చేసుకుని ఉంది. ఫస్ట్ లుక్కే ఇలా ఉందంటే... షార్ట్ ఫిల్మ్ ఏ రేంజిలో ఉంటుందో?

మహబూబా షూటింగులో పూరి
ప్రస్తుతం పూరి జగన్నాధ్ ‘మెహబూబా' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు. నేహా శెట్టి హీరోయిన్. 2018లో ఈ సినిమా విడుదల కాబోతోంది. తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు పూరి ఎంతో కేర్‌ఫుల్‌గా ఈ సినిమా తీస్తున్నారు.


Click it and Unblock the Notifications











