»   » ఇండియా నాకు పరాయి దేశంలా ఉంటుంది: పూరి జగ్నాధ్

ఇండియా నాకు పరాయి దేశంలా ఉంటుంది: పూరి జగ్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాధ్ కథలు రాయడానికి ఎక్కువగా బ్యాంకాక్ వెళతారనే విషయం తెలిసిందే. తాజాగా ‘లోపర్' మూవీ ప్రెస్ మీట్లో పూరి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. మీరు కథలు రాయాలంటే బ్యాంకాక్ వెళ్లాల్సిందేనా? అనే ప్రశ్నకు పూరి స్పందిస్తూ కాస్త భిన్నంగా స్పందించారు.

నేను బీచ్‌లో కూర్చుని కథలు రాయాల‌నుకుంటాను. వైజాగ్ బీచ్‌లో కూర్చోనివ్వ‌రు క‌దా. అందుకే బ్యాంకాక్‌ వెళతాను. ముందు నేను కూడా ఇండియాలోనే రాసుకునేవాడిని. డ‌బ్బులొచ్చాక బ్యాంకాక్‌కి వెళ్తున్నా. అక్క‌డివారికి నా భార్య‌, పిల్ల‌ల పేర్లు బాగా తెలుసు. ఇండియా నాకు ప‌రాయిదేశంలా ఉంటుంది. బ్యాంకాక్ సొంత ఊరులా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు.

వరుస పెట్టి స్పీడుగా సినిమాలు తీయగలగడానికి.... పక్కాగా ప్లానింగ్ ఉండటమే కారణం. నా టీంను కూర్చోబెట్టి స్టోరీ చెబుతాను. అంతా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళతాం. నా సినిమాల షూటింగులకు ఎండ వల్లో, వాన వల్లో ఆటంకం కలుగుతుంది కానీ ప్లానింగ్ లోపం వల్ల ఆటంకం మాత్రం రాదు అని పూరి తెలిపారు.

Puri Jagannadh interview

మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా. అంత‌లో ఆయ‌న మ‌రో సినిమా కమిట్ అయ్యారు. త్వరలో ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అన్నారు. హాలీవుడ్ స్టార్ ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట అనే ప్రశ్నకు స్పందిస్తూ...మేం అనుకున్న విష‌యాలు మీ వ‌ర‌కు అంత ఫాస్ట్ గా ఎలా రీచ్ అవుతాయి? అంటూ ఆశ్చర్య పోయారు పూరి.

మీడియా గాసిప్స్ పై స్పందిస్తూ....గాసిప్స్ రాస్తున్నార‌ని మీడియాను ప‌క్క‌న‌పెట్ట‌లేం. ఆ మాట‌కొస్తే గాసిప్స్ రాకూడ‌ద‌నుకుంటే ఏ ప‌నీ చేయ‌కూడ‌దు. ఏ ప‌ని చేసినా గాసిప్స్ వ‌స్తూనే ఉంటాయి. వాటిని లైట్ టీసుకోవాలంతే అని వ్యాఖ్యానించారు. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం రోగ్ మూవీ షూటింగ్ మొద‌లు పెట్టాం. జ‌రుగుతోంది. తెలుగు, క‌న్న‌డ‌లో తీస్తున్నామని తెలిపారు.

English summary
Puri Jagannadh interview about Loafer Movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu