Ismart Shankar సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే.. రిలీజ్ ఎప్పుడంటే?

తెలుగు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. రామ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. అయితే ఈ సినిమా తర్వాత పూరీ మళ్లీ ఫాంలోకి వచ్చాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీశాడు. అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన ఆ చిత్రం ప్లాప్ గా నిలిచింది. దీంతో మళ్లీ పూరి ప్లాపులకు సొంతం అయ్యాడు.

దాని నుంచి కోలుకొని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని పూరీ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్పెషల్ స్టోరీ రాసుకున్నట్లు సమాచారం. అది కూడా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. పార్ట్-1లో లాగే ఈ చిత్రంలో కూడా రామ్ యే హీరోగా నటించబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో ప్రారంభించ బోతున్నట్లు సమాచారం.

Puri Jagannadh ismart shankar 2 with ram pothineni latest update

వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవి చివర్లో లేదా 2024 జూలై 18వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జులై 18వ తేదీ ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా అదే రోజు విడుదల అయింది. సినిమా షూటింగ్ పూర్తయిన సమయాన్ని బట్టి వేసవిలోనో లేదా జులై 18వ తేదీనో రిలీజ్ చేస్తారు.

మాస్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా అంటే చాలా మందికి ఇప్పటికీ ఇష్టమే. అయితే రామ్ హీరోగా, పూరీ డైరెక్టర్ గా మరోసారి కాంబో రిపీట్ అవుతుందని తెలిసినప్పటి నుంచి రామ్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ను ఇష్టపడే అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు వంటి విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా 2023 దసరా సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే పూరీతో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X